సైరా షూటింగ్ అందుకే ఆల‌స్యం..!

Last Updated on by

అనుకున్న దానికంటే సైరా షూటింగ్ నెమ్మ‌దిగా సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్నెళ్లైంది షూటింగ్ మొద‌లై. కానీ పూర్తైంది మాత్రం 40 శాతం కూడా లేదు. దానికి కార‌ణం చిరంజీవి. పాపం ఆయ‌న కూడా చేసేదేం లేదు ఎందుకంటే ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు ఎలా ప‌డితే ఎగ‌ర‌డానికి.. యాక్ష‌న్ సీక్వెన్సులు చేయ‌డానికి చిరు చిన్న పిల్లాడేం కాదు. ఆయ‌న వ‌య‌సు 62. క‌నీసం దానికి రెస్పెక్ట్స్ ఇవ్వాలి క‌దా..! అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రోజు రాత్రుళ్లు కూడా షూటింగ్ చేస్తున్నాడు మెగాస్టార్.

యాక్ష‌న్ సీక్వెన్సుల విష‌యంలో బాడీ డ‌బుల్స్ యూజ్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. పైగా దీని కోసం విఎఫ్ఎక్స్ వ‌ర్క్ వాడుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంలో 3డి ఫేస్ టెక్నాల‌జీ కూడా వాడుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీనికోస‌మే ప్ర‌త్యేకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ను తీసుకొచ్చారు కూడా. ఇక ఇప్పుడు కూడా హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో కొన్ని సీన్స్ చేస్తున్నాడు మెగాస్టార్. డిసెంబ‌ర్ నాటికి సైరా షూటింగ్ పూర్తి చేయాల‌నేది చిరంజీవి ప్లాన్. మ‌రి ఆలోపు చిరు ఇంకెంత చెమ‌టోడుస్తాడో..?

User Comments