స్పెష‌ల్ స్టోరి: తెలుగు హీరోల‌కు ఏమైంది!

తెలుగు హీరోల‌కు ఏమైంది. వారి చుట్టూ ఏం జ‌రుగుతోంది. ఓ పక్క వ‌రుస విజ‌యాల‌తో దేశం మొత్తం తెలుగు చిత్ర ప‌కిశ్ర‌మ‌వైపు చూస్తున్న వేళ ఏంటీ ప్ర‌మాదాలు?. ఎక్క‌డ వుంది లోపం?. టెక్నీషియ‌న్‌ల అల‌స‌త్వ‌మా? ల‌ఏక నిర్ల‌క్ష్య‌మా?. హిట్టు కోసం ప‌డే తాపత్ర‌యంలో తెలుగు హీరోలు ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారా? ఇవి ప్ర‌స్తుతం స‌గ‌టు ప్రేక్ష‌కుడిని తొలుస్తున్న ప్ర‌శ్న‌లు. తెలుగు హీరోల‌కు షూటింగ్ లో ప్ర‌మాదాలు అన్న‌ది ఇప్పుడు కొత్త ఏమీ కాదు కానీ ఈ మ‌ధ్యే అది ఎక్కువ కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

మొన్న `జెర్సీ` షూటింగ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని గాయాల‌పాల‌య్యాడు. ఆ త‌రువాత అట్ట‌హాసంగా మొద‌లైన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేయి ఫ్రాక్చ‌ర్ అయింది. దాంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వ‌చ్చింది. `బాహుబ‌లి` స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రానా గాయ‌ప‌డ్డారు. మొన్న మెగా హీరో వ‌రుఫ్ తేజ్ కారు ప్ర‌మాదానికి గుర‌య్యారు. తాజాగా ఫైట్ మాస్ట‌ర్ త‌ప్పిదం, హీరో నాగ‌శౌర్య  అత్యుత్సాహం కార‌ణంగా 15వ అంత‌స్తు నుంచి జారిప‌డ‌టంతో ఎడ‌మ‌కాలు ఫ్రాక్చ‌ర్ అయింది. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోలకు ఏమైంద‌ని క‌ల‌క‌లం మొద‌లైంది. తాజాగా `తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌` చిత్ర షూటింగ్ క‌ర్నూల్‌లో జ‌రుగుతోంది. బ‌స్సు నుంచి జంప్ చేసే స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

ఫైట్ మాస్ట‌ర్ స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోని కార‌ణంగా సందీప్ కిష‌న్ బ‌స్ నుంచి బ్యాలెన్స్ త‌ప్పి అమాంతం కింద‌ప‌డిపోవ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్‌కు గురైన చిత్ర బృందం వెంట‌నే సందీప్ కిష‌న్‌ని స‌మీపంలో వున్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌రువాత ఆయ‌న‌ను హైద‌రాబాద్ నిమ్స్‌కు త‌ర‌లిస్తున్నార‌ని తెలిసింది. వ‌రుస‌గా తెలుగు హీరోలు ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌టం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ని క‌ల‌వానికి గురిచేస్తోంది. గ‌తంలో `మ‌గాడు` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ ప్ర‌మాదానికి గురై కాలు విరిగిన విష‌యం తెలిసిందే. ఇన్నాళ్ల త‌రువాత మ‌ళ్లీ అదే సంఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతుండ‌టంతో టాలీవుడ్ హీరోల‌కు ఏమైంది? ఏం జ‌రుగుతోందని అంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుంద‌డం గ‌మ‌నార్హం. సెఫ్టీ పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్రమాదాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు.