ఆ ముగ్గురిపై 10కోట్లు ఫైన్‌

Last Updated on by

విజ‌య్‌- మురుగ‌దాస్ కాంబో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జోడీ నుంచి ఇప్ప‌టికే రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్లు వ‌చ్చాయి. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నం `స‌ర్కార్‌`. ఈసారి ఇల‌య‌ద‌ళ‌ప‌తి నేరుగా రాజ‌కీయాల్నే ట‌చ్ చేస్తున్నాడు. అందుకు అదిరిపోయే స్క్రిప్ట్‌ని మురుగ‌దాస్‌తో క‌లిసి రెడీ చేయించుకున్నాడు. ఈ కాంబో సూటిగా మోదీ స‌ర్కార్‌పైనా, త‌మిళ‌నాడు లోక‌ల్ గ‌వ‌ర్నెన్స్ పైనా టార్గెట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రం రిలీజైతే త‌మిళ‌నాట రాజ‌కీయం భ‌గ్గుమ‌న‌డం ఖాయ‌మని అంతా అంచనా వేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్‌లో సిగ‌రెట్ వెలిగించిన ఇల‌య‌ద‌ళ‌ప‌తి ఫోజు పెనుకంప‌నాల‌కు కార‌ణ‌మైంది. ఓ సెక్ష‌న్ ప్ర‌జ‌లు ఈ స్టిల్‌ని వ్య‌తిరేకించారు.

క్యాన్స‌ర్‌కి కార‌క‌మ‌య్యే సిగ‌రెట్‌ని ఇలా ఎంక‌రేజ్ చేస్తారా… అంత పెద్ద స్టార్ ఇలా చేయ‌డం త‌గ‌దు! అంటూ నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. అందుకు ప‌రిహారం చెల్లించాల్సిందేనంటూ ప్ర‌స్తుతం ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశారు. విజ‌య్‌-మురుగ‌దాస్‌- క‌ళానిధి మార‌న్‌ల‌పై పిటిష‌న్‌లో 10కోట్లు డిమాండ్ చేస్తూ వ్యాజ్యం వేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ గొడ‌వ ర‌చ్చ‌వుతోంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆ ముగ్గురూ క‌లిసి ఒక క్యాన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌కి డొనేట్ చేయాలని డిమాండ్ ఊపందుకుంది. అయితే ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో స‌ర్కార్ పోస్ట‌ర్ ని త‌న సామాజిక మాధ్య‌మాల నుంచి విజ‌య్ తొల‌గించారు.

User Comments