భామ‌లు ప‌దేళ్ల క్రితం

Last Updated on by

హాట్ గాళ్స్ హీటెక్కించే ఛాలెంజ్ తో ముందుకొచ్చారు. ప‌దేళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ల‌మో చూపిస్తూ నాటి ఫోటోల్ని, నేటి ఫోటోల‌కు జోడించి వాటిని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తున్నారు. తొలిగా ఈ ఛాలెంజ్ హాలీవుడ్ లో మొద‌లై, లేటెస్టుగా బాలీవుడ్ కి పాకింది. అట్నుంచి టాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌వేశించ‌నుంది.
తాజాగా కొంద‌రు క‌థానాయిక‌లు పాత ఫోటో ఆల్బ‌మ్స్ లోంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. ఈ 10 ఇయ‌ర్స్ ఛాలెంజ్ లో నాడు ఎలా ఉన్నారు? నేడు ఎలా ఉన్నారు.. అన్న‌ది తెలుసుకునే వీలుంటోంది. కికీ  ఛాలెంజ్ త‌రహాలోనే ఈ 10 ఇయ‌ర్స్ ఛాలెంజ్ కూడా పాపుల‌ర‌వుతోంది. ఈ ఛాలెంజ్ లో ఇప్ప‌టికే ప‌లువురు భామ‌లు ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. బాలీవుడ్ భామ‌లు బిపాసా బ‌సు, డెయిసీ షా, శిల్పాశెట్టి, శ్రుతిహాస‌న్, దియా మిర్జా ఈ ఛాలెంజ్ లో ఫోటోల్ని షేర్ చేశారు.  జ‌హీర్ ఖాన్ భార్య సాగ‌రిక… హాలీవుడ్ నాయిక‌లు జెన్నిఫ‌ర్ లోపెజ్, ఫిష‌ర్ త‌దిత‌రులు పాత‌-కొత్త ఫోటోల్ని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వేగంగా వైర‌ల్ అవుతున్నాయి.

User Comments