1000కోట్ల `మ‌హాభార‌తం` కంచికే!

Last Updated on by

దాదాపు 1000 కోట్ల బడ్జెట్ని వెచ్చించేందుకు దుబాయ్కి చెందిన బిఆర్ శెట్టి లైన్లోకొచ్చాడు. `మహాభారతం` తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానని మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రకటించి ఇప్పటికే చాలా కాలమైంది. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా భీముడి యాస్పెక్ట్లో ఉంటుందని, టైటిల్ పాత్రలో లాల్ నటిస్తారని ప్రచారం సాగింది. ఎం.టీ వాసుదేవన్ నాయర్ రచించిన `రాందమూళం` అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నామని ప్రచారార్భాటం చేశారు.

అయితే అదంతా ఉత్తిదేనని తాజాగా తేలిపోయింది. మోహన్లాల్, శ్రీకుమార్ మేనన్ తదితరులపై రచయిత వాసుదేవన్ నాయర్ సీరియస్ అవ్వడంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఊడుతుందా? అన్న సందిగ్ధత నెలకొంది. 1000 కోట్లు అంటే ఆషామాషీనా? ఆశపడినంత వీజీ కాదని వీళ్లకు అర్థమైనట్టుంది. ఆ క్రమంలోనే నాయర్ ఎందుకనో తన అసహనాన్ని ఎఫ్బీలో వెల్లగక్కారు. ప్రకటించి నాలుగేళ్లయింది. ఇంకా దిక్కులేదు! అసలు తీస్తారో తీయరో అడిగేస్తాను అంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ తీయకపోతే నా స్క్రిప్టు నాకు ఇచ్చేయండి! అంటూ డిమాండ్ చేశాడు. మొత్తానికి 1000 కోట్ల `మహాభారతం` కథ మొదటికే వచ్చినట్టయ్యింది.

User Comments