100 కోట్ల క్ల‌బ్‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌!?

Last Updated on by

మా సినిమా వ‌సూళ్లు ఘ‌నం అని అధికారికంగా ప్ర‌క‌టించేస్తే స‌రిపోదు.. ఆన‌క జీఎస్టీ ప‌క్కాగా క‌ట్టాలి. అలా చెల్లించ‌నివారిపై ఆదాయ‌ప‌న్ను శాఖ చాలా సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకునేందుకు స‌న్నాహాలు చేస్తోందని తెలంగాణ ఆదాయ‌ప‌న్ను అధికారి ఒక‌రు గుంభ‌న‌గా కామెంట్ చేయ‌డంపై ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల గుండెల్లో గుబులు రేపుతోంది. మా సినిమా 100 కోట్లు వ‌సూలు చేసింది. 150 కోట్లు …, 200 కోట్ల వ‌సూళ్లు అంటూ అధికారికంగా ప్ర‌చారం చేసేవారిపై ఆదాయ‌ప‌న్ను శాఖ సీరియ‌స్‌గా దృష్టి సారించింద‌ని తెలుస్తోంది. అస‌లు సినిమావాళ్లు అంటేనే అంతెత్తున లేచే ఆదాయ‌ప‌న్ను అధికారులు ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉన్నారు అంటే.. దానివెన‌క కూడా ఓ అర్థం ఉంద‌న్న‌ది ప‌లువురి విశ్లేష‌ణ‌. ఏదో ఒక టైమ్ చూసుకుని దెబ్బ కొట్టాలి! టైమ్ చూసి సందు చూసి కొట్టాలి! అన్న ప్ర‌ణాళిక ప‌క్కాగా ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో రెండు అగ్ర‌బ్యాన‌ర్ల సినిమాలు సంచ‌లన విజ‌యం సాధించాయి. ఈ సినిమాల‌కు సంబంధించి అధికారికంగానే ట్విట్ట‌ర్ల ద్వారా 100 కోట్ల క్ల‌బ్‌, 150 కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్ల‌ను ముద్రించారు. అటుపై వీటిని అభిమానులు సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌పంచ‌మంతా షేర్ చేశారు. వీట‌న్నిటినీ సేక‌రించుకున్న ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు, జీఎస్టీ వింగ్ వీళ్లంతా ఆరాలు మొద‌లుపెట్టార‌ని తెలిసింది.

అయితే ఇలా అధికారికంగా ప్ర‌క‌టించిన నిర్మాత‌లే జీఎస్టీ చెల్లిస్తారా? లేక అస‌లు ఆ ప‌న్నుల‌న్నీ ఎవ‌రు క‌డతారు? అన్న‌దానిపై చాలా కొద్దిమందికి మాత్ర‌మే అవ‌గాహ‌న ఉంటుంది. ట్రేడ్‌లో త‌ల‌మునక‌లుగా ఉండేవారికి తెలిసినంత ఇత‌ర‌త్రా సామాన్య జ‌నాల‌కు తెలియ‌నే తెలీదు. అయితే జీఎస్టీ చెల్లింపులు సినిమా మేక‌ర్స్ ఎలా చేస్తారు? అంటే పూర్తిగా నిర్మాత‌కే సంబంధం ఉండ‌ద‌ని, ఏరియావైజ్ డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్లు, సినిమా కొనుక్కుంటే కొనుక్కున్న ఎగ్జిబిట‌ర్లు జీఎస్టీ చెల్లిస్తార‌ని ఇదివ‌ర‌కూ ఆదాయ‌పు ప‌న్ను దాడుల‌కు గురైన బాదిత ఫిలింమేక‌ర్ కం ఎగ్జిక్యూటివ్ నిర్మాత కం అకౌంటెంట్‌ తెలిపారు. అయితే జీఎస్టీ ఏ మేర‌కు బాదుతున్నారు? అని ప్ర‌శ్నిస్తే… అది సినిమాని బ‌ట్టి ఉంటుంది. రేంజును బ‌ట్టి 15 శాతం నుంచి 20 శాతం వ‌ర‌కూ బాదుడు ఉంటుంద‌ని తెలిపారు. పెద్ద సినిమాల‌కు ఒక స్లాబు, చిన్న సినిమాలకు వేరొక స్లాబు జీఎస్టీలో ఉందా? లేదా? అన్న‌ది అవ‌గాహ‌న కొద్దిమందికే ఉంది కాబ‌ట్టి.. దానిపైనా స‌వివ‌రాలు ఫిలింమేక‌ర్స్ వెల్ల‌డిస్తారేమో చూడాలి. ఇంత‌కీ 100 కోట్ల‌కు జీఎస్టీ ఎంత చెల్లించాలి? 150కోట్ల‌కు ఎంత జీఎస్టీ చెల్లించాలి? లేదూ 200 కోట్ల‌కు ఎంత జీఎస్టీ చెల్లించాలి? త‌్వ‌ర‌లోనే తెలుసుకుందాం.. వాచ్ దిస్ స్పేస్..

User Comments