11 ప్లేయ‌ర్స్‌తో మెగా క్రికెట్ టీమ్

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి అనే వృక్షం నీడ‌లో 11 మంది ప్లేయ‌ర్స్ ఆటాడుతున్నారు. చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌, వ‌రుణ్ తేజ్, శిరీష్, సాయిధ‌ర‌మ్ తేజ్, క‌ల్యాణ్ దేవ్, వైష్ణ‌వ్ తేజ్, నిహారిక‌.. ఇంత‌మంది స్టార్లు ఒక్క మెగా కుటుంబంలోనే ఉన్నారు. క‌రెక్టుగా లెక్క‌కు 11 మంది ఆట‌గాళ్లు తేలారు. ఇక వీళ్లంతా ఒక క్రికెట్ టోర్నీలే ఆడొచ్చు! అంటూ అభిమానులు స‌ర‌దాగా మాటా మంతీ క‌లిపేస్తున్నారు.

ఇప్ప‌టికే `ఖైదీనంబ‌ర్ 150`తో చిరంజీవి కంబ్యాక్ గ్రాండ్ స‌క్సెస్. 151వ సినిమా `సైరా`తో ఇండ‌స్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు త‌పిస్తున్నారు. వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌య్యారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క్యారెక్ట‌ర్ న‌టుడిగా, బుల్లితెర హోస్టుగా రాణిస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ కి రాజ‌కీయాల్లో అండ‌గా నిలుస్తున్నారు. ప‌వ‌న్ సినిమాల‌కు కామా పెట్టి, రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. ప‌వ‌న్- జ‌న‌సేన ఏపీలో కీల‌క పార్టీగా మారింది. రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని ఇప్ప‌టికే స్టార్ హీరోలుగా రాజ్య‌మేలుతున్నారు. సాయిధ‌ర‌మ్ స్టార్ డ‌మ్ కోసం పాకులాడుతున్నాడు. ఆ క్ర‌మంలోనే అల్లు శిరీష్ సైతం కెరీర్ ని ప‌రుగులు పెట్టించే ఆలోచ‌న‌లో ఉన్నారు. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ డెబ్యూ సినిమా ప్లాపైనా, మునుముందు చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకొస్తున్నాడ‌ట‌. నేడు సుకుమార్ శిష్యుడు ద‌ర్శ‌క‌త్వంలో సుక్కూ రైటింగ్స్ లో వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ సినిమా మొద‌లైంది. వైష్ణ‌వ్ గ్రాఫ్ పై మెగా ఫ్యామిలీ చాలా కాన్ఫిడెన్స్ తో ఉందిట‌. సాయిధ‌ర‌మ్ ని తిరిగి ట్రాక్ లోకి తేవ‌డం, అలాగే అత‌డి త‌మ్ముడు వైష్ణ‌వ్ ని బెస్ట్ ప్లేయ‌ర్ గా తీర్చిదిద్ద‌డ‌మే ధ్యేయంగా సాగుతున్నారు. ఇక ఇప్ప‌టికే మెగా ప్రిన్సెస్ నిహారిక విక్కీ కీప‌ర్ గా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. స‌రైన హిట్టు ప‌డితే త‌న స్టార్ డ‌మ్ కి తిరుగే ఉండ‌ద‌ని ఆశిస్తోంది. ఇంత మంది ప్లేయ‌ర్స్ కి కెప్టెన్ గా మెగాస్టార్ దిశా నిర్ధేశ‌నం చేస్తున్నారు. ఈ టీమ్ కి అత‌డే స‌ర్వం.. స‌ర్వాంత‌ర్యామి. ఒక వృక్షం వ‌ట‌వృక్షంలా మారి, ఇన్ని పిల్ల‌ల్ని పెట్టింది. ఈ పిల్ల‌ల‌న్నీ పెరిగి పెద్ద‌వై ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ నే లీడ్ చేసేంత‌గా స్కోప్ ని ఇవ్వ‌డం ఓ సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. సౌత్ ఇండ‌స్ట్రీస్‌, నార్త్ ఇండ‌స్ట్రీస్ లోనే ఇంత‌టి సీను వేరొక‌రికి లేదంటే అతిశ‌యోక్తి కాదు.

User Comments