118 మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు : క‌ళ్యాణ్ రామ్, నివేద‌ థామ‌స్, షాలిని పాండే, నాజ‌ర్ త‌దిత‌రులు..

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత: మ‌హేష్ కోనేరు

సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌

రచన- దర్శకత్వం: గుహ‌న్

ముందు మాట:

క‌ళ్యాణ్ రామ్ హీరోగా గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వ ంలో మ‌హేష్ కోనేరు నిర్మించిన సినిమా 118. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. అనుక్ష‌ణం, ఫైన‌ల్ డెస్టినేష‌న్ లైన్ లో ఆద్యంతం ఉత్కంఠ క‌లిగించే చిత్ర‌మిద‌ని క‌ళ్యాణ్ రామ్ ప్రామిస్ చేశారు. ప‌టాస్ త‌ర్వాత అత‌డికి స‌రైన హిట్టు లేదు. ఈ సినిమాతో అయినా బ్రేక్ వ‌స్తుందేమో చూడాలి. దాదాపు 14కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. ఇప్ప‌టికే సెన్సార్ బృందం ఎలాంటి క‌ట్స్ లేకుండా యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ ను ఇవ్వ‌నుందే తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
ఒక కుర్రాడికి 118 హోట‌ల్ రూమ్ కి ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? అక్క‌డ అత‌డు క‌న్న క‌ల ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింది? అస‌లింత‌కీ ఆ క‌ల‌లో అత‌డికి ఏం క‌నిపించింది? ఆ క‌ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లే య‌థాత‌థంగా రియాలిటీలో అత‌డికి ఎలా ఎదుర‌వుతున్నాయి? ఆ క‌ల వెన‌క ఉన్న న‌గ్న స‌త్యం ఏంటో తెలుసుకునేందుకు చేసే ప్ర‌య‌త్నంలో త‌న‌కు తెలిసిన నిజాలేంటి? ఆ క‌ల‌లో త‌న‌కు క‌నిపించిన ఆ అంద‌మైన అమ్మాయి ఎవ‌రు? అస‌లింత‌కీ ఆ అమ్మాయిక ఎదురైన ప్ర‌మాదం ఏంటి? యాక్సిడెంట్ కి గురైన ఆ కార్ ఎవ‌రిది? ఇందులో మెడిక‌ల్ మాఫియా క‌థేంటి? చివ‌రికి ఆ క‌ల‌లోని చిక్కుముడిని విప్పాడా లేదా? ఇదీ.. సింపుల్ గా 118 క‌థాంశం.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్ కి ఆస్కారం ఉన్న ఈ క‌థ‌ని గుహ‌న్ ఏ స్థాయిలో చూపించాడు అన్న ప్ర‌శ్న వ‌స్తే .. ఈ సినిమా ప్ర‌థ‌మార్థం డీసెంట్ అప్పియ‌రెన్స్ తో ఆక‌ట్టుకుంద‌ని చెప్పొచ్చు. క‌థ‌లో తాను ఏం చెప్ప‌ద‌లిచాడో దానిని నీట్ గా చూపించారు. ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా స‌స్పెన్స్ ని రివీల్ చేసే విధానం ఆక‌ట్టుకుంది. ఆరంభమే క‌ళ్యాణ్ రామ్ క‌ల‌తో సినిమాని ఓపెన్ చేశాడు. ఆ క‌ల‌లో ఎవ‌రో నివేద‌ను గాయ‌ప‌రుస్తారు. ఆరు నెల‌లు గ‌డిచాక క‌థ‌లోకి వెళితే అక్క‌డ క‌ళ్యాణ్ రామ్ ఓ టీవీ జ‌ర్న‌లిస్ట్. త‌న‌కు వ‌చ్చిన ఆ క‌ల వెన‌క ఏదో న‌గ్న స‌త్యం దాగి ఉంద‌ని దానిని ప‌రిశోధించ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆ క‌ల అత‌డిని ప‌దే ప‌దే వెంటాడుతూ ఉంటుంది. హోమ్ మంత్రి గూండాలు చేసే అరాచ‌కాలు, అక్ర‌మాల‌ను ఎదురించిన జ‌ర్న‌లిస్టుగా గూండాల‌తో పోరాడ‌తాడు. షాలిని పాండే అత‌డి గాళ్ ఫ్రెండ్. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రొమాన్స్.. అటుపై ఈ క‌థ‌లో డాక్ట‌ర్ నాజ‌ర్ ఎంట్రీతో అస‌లు క‌థ రివీల‌వుతుంది. ఆ క్ర‌మంలోనే అస‌లు త‌న‌కు వ‌చ్చిన ఆ క‌ల క‌న్ క్లూజ‌న్ ఏంటో తెలుసుకోవ‌డానికి అదే హోట‌ల్ రూమ్ నం.118కి వెళ‌తాడు. అయితే ఆ క‌ల రావాలంటే పౌర్ణ‌మి రోజు మాత్ర‌మే ఆ ఛాన్స్ అని గ్ర‌హిస్తాడు.

క‌ళ్యాణ్ రామ్ ప‌రిశోధ‌న‌ను విల‌న్ గ్యాంగ్ ట్రేస్ చేస్తుంది. అత‌డిని వెంటాడుతుంది. ఆధారాలు చిక్క‌కుండా వెంట‌ప‌డుతుంది. చివ‌రికి ఆ క‌ల వెన‌క ఓ మెడిక‌ల్ మాఫియా బ‌య‌ట‌పడుతుంది. ఆ మాఫియా వ‌ల్ల‌నే నివేద‌కు ప్ర‌మాదం వాటిల్లిందా? చివ‌రికి ఆ ర‌హ‌స్యాన్ని ఛేదించాడా లేదా అన్న‌ది స‌స్పెన్స్.

నటీనటులు:
క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న ప‌రంగా 100 శాతం ప‌రిణ‌తి క‌న‌బ‌రిచారు. నివేద క‌నిపించింది చివ‌రి 20 నిమిషాలే అయినా అద్భుత‌మైన పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. షాలిని, ఇత‌ర న‌టీన‌టులు ఓకే. డాక్ట‌ర్ గా నాజ‌ర్ చ‌క్క‌గా కుదిరారు.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా సినిమాటోగ్రాఫ‌ర్ గుహ‌న్ ఈ చిత్రాన్ని చ‌క్క‌గా చూపించారు. ద‌ర్శ‌క‌త్వ విభాగంలోనూ ఫ‌ర్వాలేద‌న్న ముద్ర వేసారు. రీరికార్డింగ్, సినిమాటోగ్ర‌ఫీ ప్ల‌స్.

ప్లస్ పాయింట్స్:

*క‌ళ్యాణ్ రామ్, నివేద‌ల న‌ట‌న‌
* ప్ర‌థ‌మార్థం

మైనస్ పాయింట్స్:
* థ్రిల్ ఏంటో ముందే తెలిసిపోవ‌డం..
*సెకండాఫ్ లో గ్రిప్ చెడ‌డం
* క‌మ‌ర్షియ‌ల్ ఇంగ్రీడియంట్ జీరో

ముగింపు:
అన్వేష‌ణ త‌ర‌హా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ .. క‌ళ్యాణ్ రామ్ అభిమానుల‌కు ఓకే..

రేటింగ్:
2.75/ 5

Also Read : 118 Live Review


Related Posts