కూతురు టిప్స్ పాతిక‌లో 12 గుడ్‌

Last Updated on by

నాటిమేటి క్లాసిక్ క‌థానాయిక మ‌హాన‌టి జీవితంపై సినిమా తీయ‌డం అంటే ఆషామాషీనా? అచ్చం సావిత్రిలా క‌నిపించే క‌థానాయిక దొర‌కాలి. అటుపై అచ్చం సావిత్రిలా న‌టించాలి. సేమ్ టు సేమ్ సావిత్రిలా ముఖాభిన‌యం, న‌డ‌క‌-న‌డ‌త ప్ర‌తిదీ కుద‌రాలి. య‌థార్థ క‌థ‌ను వ‌క్రించ‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పించాలి. ఇలాంటి సాహ‌సం చేసింది అశ్వ‌నిద‌త్ కాంపౌండ్. అందుకు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌నుందనే ఆశిస్తున్నారంతా. అదంతా అటుంచితే, అమ్మ జీవితాన్ని వెండితెర‌పై చూసుకున్న విజ‌య‌ఛాముండేశ్వ‌రి మాత్రం ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు.

కీర్తి సురేష్‌కి వేరొక ఆల్ట‌ర్నేట్ సావిత్రి లేనేలేద‌ని కితాబిచ్చారు. కీర్తి సురేష్‌ అచ్చం అమ్మ‌లానే న‌టించింది. ఈ న‌వ‌త‌రం నాయిక వాస్త‌వంగానే స‌హ‌జ‌న‌టి. ఈ సినిమా ప్రారంభించాక .. నేను 20-25 టిప్స్ ఇచ్చాను. వాటిలో 12 మ్యాన‌రిజ‌మ్స్ (శ‌రీర‌భాష‌) య‌థాత‌థంగా ఎంతో స‌హ‌జంగా కుదిరాయి. తినే తిండి, న‌డ‌క‌, న‌డ‌త‌, కాస్ట్యూమ్స్ ప్ర‌తిదీ ఎలా ఉంటాయో చెబితే వాటిని అచ్చం అలానే చేసి చూపించింది కీర్తి. రెండుసార్లు మాత్ర‌మే లొకేష‌న్‌కి వెళ్లాను. ఆ టైమ్‌లో కీర్తి న‌డిచొస్తుంటే అచ్చం అమ్మ న‌డిచొచ్చిన‌ట్టే ఉంది“ అని అన్నారు. మ‌హాన‌టి సావిత్రిపై చివ‌రి రోజుల్లో వ‌చ్చిన‌వ‌న్నీ త‌ప్పుడు రూమ‌ర్లు మాత్ర‌మేన‌ని ఖండించారు. సినిమాలో చూపించిన‌ది అస‌లైన వాస్త‌వం అని ఛాముండేశ్వ‌రి ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. మొత్తానికి కీర్తికి 25 టిప్స్ ఇస్తే, అందులోంచి 12 టిప్స్ స‌మ‌ర్థంగా వ‌ర్క‌వుట‌య్యాయ‌న్న‌మాట‌!

User Comments