Last Updated on by
కింగ్ నాగార్జున దాదాపు 15ఏళ్ల తర్వాత బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాది మీడియాలో ఇదో హాట్ టాపిక్. సౌత్ సూపర్‌స్టార్ ఆగయారే అంటూ ఒకటే మోత మోగిపోతోంది బాలీవుడ్ మీడియాలో.. వివరాల్లోకి వెళితే..
కింగ్ నాగార్జున బాలీవుడ్లో క్రిమినల్, ద్రోహి, జక్మ్, ఎల్వోసీ కార్గిల్ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించి ఉత్తరాదిన అభిమానుల్ని సంపాదించుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన బాలీవుడ్లో అడుగుపెడుతున్నారని తెలిసింది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వ ంలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బ్రహ్మాస్త్రలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వంటి స్టార్లు నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఎలాంటి పాత్రలో నటిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. నేటి నుంచి అమితాబ్‌తో కలిసి సౌత్ సూపర్‌స్టార్ నాగార్జున కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. 1992లో బిగ్‌బి అమితాబ్‌తో కలిసి నాగార్జున ఖుదాగవ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 1990లో శివ సినిమాతో నాగార్జున బాలీవుడ్లో ప్రవేశించారు. 2003లో ఎల్వోసి కార్గిల్ చిత్రం రిలీజైంది. తెలుగులో నానితో కలిసి నాగార్జున దేవదాసు అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజవుతుంది. 15 ఆగష్టు 2019న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర రిలీజ్ కానుంది.
User Comments