టాప్ -15లో 2.0 ఎక్క‌డ‌?

Last Updated on by

2.0 రిలీజ్‌కి ఇంకొన్ని గంట‌లు మాత్ర‌మే స‌మ‌యం మిగిలి ఉంది. ఈ సినిమా ఎలాంటి రికార్డుల్ని న‌మోదు చేస్తుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ సౌతిండియాలో టాప్ 15 సినిమాల జాబితాని తిర‌గేస్తే అందులో 2.0 స్థానం ఎక్క‌డ ఉంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ అభిమానుల్లో సాగుతోంది. రోబో త‌ర్వాత సీక్వెల్, ప్రీక్వెల్ కాని తాజా చిత్రం ఎలాంటి రాకార్డుల్ని నెల‌కొల్ప‌నుంది? అన్న‌దే అస‌లు చ‌ర్చ‌.

బాహుబ‌లి 2 చిత్రం దాదాపు 1700కోట్ల గ్రాస్‌తో సౌతిండియాలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. బాహుబ‌లి -565 కోట్ల తో రెండో స్థానంలో ఉంది. ఎంథిర‌న్ (రోబో)-285కోట్లు, క‌బాలి-282 కోట్లు, మెర్స‌ల్ -255కోట్లు, స‌ర్కార్ -250కోట్లు, ఐ-230కోట్లు, రంగ‌స్థ‌లం-213కోట్లు, ఖైదీనంబ‌ర్ 150-161కోట్లు, తేరి- 155కోట్లు, కాలా-155కోట్లు, శివాజీ- 150కోట్లు, ఏఎస్‌వీఆర్‌- 144కోట్లు, శ్రీ‌మంతుడు-144కోట్ల‌తో తొలి 15 స్థానాల్ని ఆక్ర‌మించాయి. 2.0 ఈ రికార్డులన్నిటినీ తిరగ‌రాసి అత్య‌ధిక గ్రాస్ వ‌సూలు చేసిన సినిమాగా నిలుస్తుంద‌నే అంచ‌నాలు వేస్తున్నారు. అంటే దాదాపు రూ.1800 కోట్లు మినిమం వ‌సూలు చేస్తేనే సౌత్ బెస్ట్ సినిమాగా నిలుస్తుంద‌న్న‌మాట‌. అది ఇండియ‌న్ సినిమాల రికార్డుల్ని వేటాడ‌డం కిందే లెక్క‌.

User Comments