2.0 క్రౌమ్యాన్ కొత్త పోస్ట‌ర్

Last Updated on by

ఈ వినాయ‌క చ‌వితి కానుక‌గా 2.ఓ 2డి, 3డి టీజ‌ర్‌ని వీక్షించే భాగ్యం క‌లిగిస్తున్నారు శంక‌ర్ టీమ్‌. ఆ మేర‌కు శంక‌ర్ బృందం ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. దీంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వీరాభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఈ టీజ‌ర్ కోసం వేచి చూస్తున్నారు. 3డి క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఐమ్యాక్స్‌లో వీక్షించేందుకు తెలుగు సినీమీడియా సైతం ఎంతో ఆత్రంగా వేచి చూస్తోంది.

అదంతా అటుంచితే.. 2.ఓ చిత్రంలో త‌న పాత్రకు సంబంధించిన క్రౌమ్యాన్ కొత్త‌ పోస్ట‌ర్‌ని కిలాడీ అక్ష‌య్ కుమార్ రిలీజ్ చేశారు. నిన్న‌టిరోజున అక్కీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల కోసం ఈ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన అక్ష‌య్‌… ఇన్నేళ్లుగా త‌న‌ని ఎంత‌గానో అభిమానిస్తూ పుట్టిన‌రోజులు చేస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఇక‌పోతే తెలుగు రాష్ట్రాల్లో 2.ఓ 3డి టీజ‌ర్‌ని ఎన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు.. అన్న‌ది తెలియాల్సి ఉందింకా. ఇంకో మూడు రోజుల్లో ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కాభిమానుల ముందుకు రానుంది. న‌వంబ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

User Comments