2.0 3డి టీజ‌ర్ ఫ్రీఫ్రీ

Last Updated on by

మిస్డ్ కాల్ ఇవ్వండి.. 2.ఓ 3డి టీజ‌ర్ ఫ్రీగా చూసేయండి! ఇదీ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇచ్చిన గ్రేట్ ఆఫ‌ర్‌. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న 2.ఓ చిత్రం టీజ‌ర్‌ని ఉచితంగా చూపిస్తామంటే జ‌నం వ‌దులుకుంటారా? ఇక న‌వంబ‌ర్‌లో ఈ సినిమాని 2డి, 3డి వెర్ష‌న్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 13న వినాయ‌క చ‌వితి కానుక‌గా ఈ టీజ‌ర్‌ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా 3డి టీజ‌ర్‌ని చూడాల‌నుకునేవారికి ఓ ఛాన్స్. పీవీఆర్, స‌త్యం థియేట‌ర్ల‌లో ఆ ఛాన్స్‌ క‌ల్పిస్తున్నాం. +91 9099949466 నంబ‌ర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి ఫ్రీ టికెట్ బుక్ చేస్కోండి“ అంటూ శంక‌ర్ ట్వీట్ చేశారు.

రజ‌నీకాంత్, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ వంటి స్టార్లు న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ సినీచ‌రిత్ర‌లోనే త‌ల‌మానికంగా ల్యాండ్ మార్క్ మూవీగా నిల‌వ‌బోతోంద‌ని శంక‌ర్ అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ టీజ‌ర్ రాక‌కోసం కోట్లాదిగా జ‌నం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. శంక‌ర్ జ‌నాల‌కు ఏ రేంజు విజువ‌ల్ ట్రీట్‌ని ఇవ్వ‌బోతున్నారో అన్న క్యూరియాసిటీ అంత‌కంత‌కు రెయిజ్ అవుతోంది. ఇంకో రెండు నెల‌ల్లోనే సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది కాబ‌ట్టి ఉత్కంఠ పెరిగిపోతోంది. నవంబ‌ర్ 29న 2.ఓ రిలీజ్ కానుంది.

User Comments