49రోజుల్లో రికార్డుల ఉప్పెన‌!

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – కిలాడీ అక్ష‌య్‌కుమార్ – శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ `2.ఓ` ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అన్ని రికార్డుల్ని చెరిపేయ‌నుందా? అంటే.. మ‌రో 49రోజుల్లో ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌నుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ తీస్తున్నామ‌ని శంక‌ర్- లైకా బృందం ప్ర‌క‌టించింది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన టీజ‌ర్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. మేకింగ్ వీడియోల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో 2.ఓ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతోందోన‌న్న ఉత్కంఠ పెరుగుతోంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ దేశాల్లో రిలీజ్ చేసేందుకు లైకా టీమ్ రెడీ అవుతోంది. ఇండియా, మ‌లేషియా, అమెరికాలో ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించ‌డం ఖాయం అన్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

మ‌రోవైపు ఈ చిత్రం బాహుబ‌లి రికార్డుల్ని ట‌చ్ చేస్తుందా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. ఎస్.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 1, 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 2500 కోట్లు వ‌సూలు చేశాయి. కేవ‌లం `బాహుబ‌లి- 2` చిత్రం 2000 కోట్లు (జ‌పాన్ వ‌సూళ్లు క‌లుపుకుని) వ‌సూలు చేసింది. అందుకే ఇప్పుడు `2.ఓ` ఆ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా? అంటూ ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. అలానే ప్ర‌పంచ దేశాల్లో అసాధార‌ణ రికార్డులు సృష్టించిన `దంగ‌ల్‌` రికార్డుల్ని 2.ఓ బ్రేక్ చేస్తుందా? అంటే దానికి కూడా న‌వంబ‌ర్ 29 స‌మాధానం కానుంది. అలానే 2.ఓ చిత్రాన్ని చైనా, మ‌లేషియాలోనూ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేసేందుకు శంక‌ర్ బృందం ఆలోచ‌న‌లో ఉంది. అంటే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్ల‌లో రికార్డులు షురూ చేసుకున్న‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ మాయాజాలంతో ఈ సినిమా ఏమేర‌కు మెప్పిస్తుంది? శంక‌ర్ విజువ‌లైజేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్స్‌ని అందుకుంటుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

User Comments