ఐపీఎల్ ఫైన‌ల్‌లో రోబో2 టీజ‌ర్

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ `2.ఓ` (రోబో2) దాదాపు 400కోట్ల బ‌డ్జెట్‌తో భారీ కాన్వాసుపై తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తోంది. ఒక‌సారి అమెరిక‌న్ కంపెనీ చేసిన వీఎఫ్ఎక్స్ న‌చ్చ‌క‌పోవ‌డంతో లైకా-శంక‌ర్ బృందం తిరిగి క్వాలిటీ వ‌ర్క్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అందుకోసం అద‌న‌పు బ‌డ్జెట్‌ని వెచ్చించ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కొచ్చింది. ఇక‌పోతే ఈ వాయిదా ఫ‌ర్వం వ‌ల్ల రోబో 2 అభిమానులు కాస్తంత నిరాస‌ప‌డాల్సి వ‌చ్చింది. అస‌లింత‌కీ రోబో 2 ఎప్పుడు రిలీజ‌వుతుంది? అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ స‌మాధానం లేదు. జ‌న‌వ‌రి 2019 లో రిలీజ‌వుతుంద‌ని భావించినా, అప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌క‌పోవ‌చ్చ‌న్న ప్ర‌చారం సాగుతోంది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. 2.ఓ చిత్రంపై సాగుతున్న ఈ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు శంక‌ర్ బృందం ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 2.ఓ టీజ‌ర్‌ని రిలీజ్ చేసి అన్ని విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఒకే ఒక్క టీజ‌ర్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న రోబో2 అభిమానులంద‌రినీ స్పెల్ బౌండ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇదివ‌ర‌కూ 2.ఓ థియేట‌ర్‌ ప్రివ్యూ టీజ‌ర్ ఒక‌టి మ‌స‌క‌మ‌స‌క‌గా బ్ల‌ర్ చేసి ఉన్న‌ది ఆన్‌లైన్‌లో లీకైంది. లైకా ప్ర‌తినిధి ర‌హ‌స్యంగా ల్యాబ్‌లో వీక్షిస్తున్న టీజ‌ర్ అది. ఒక‌వేళ ఇప్పుడు ఆ టీజ‌ర్‌ని ఒరిజిన‌ల్ క్వాలిటీతో రిలీజ్ చేస్తారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈనెల 27న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక‌పై టీజ‌ర్ రిలీజ‌వుతుందేమో వేచి చూడాల్సిందే.

User Comments