2.ఓ టీజ‌ర్ విజువ‌ల్ బ్లో

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – కిలాడీ అక్ష‌య్ కుమార్ కాంబోని ఎంచుకుని శంక‌ర్ చేస్తున్న అసాధార‌ణ ప్ర‌య‌త్నం `2.ఓ`. ఏ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జేయ మోహ‌న్ క‌థ అందించారు. దాదాపు 540కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏ ఇత‌ర హాలీవుడ్ చిత్రానికి త‌గ్గ‌ని రీతిలో తెర‌కెక్కిస్తున్నామ‌ని శంక‌ర్ ప్ర‌క‌టించారు. ఆ మాట‌ను నిల‌బెట్టుకుంటూ నేటి ఉద‌యం రిలీజ్ చేసిన 2.ఓ టీజ‌ర్ మెరుపులు మెరిపించింది.
2.ఓ (రోబో2) టీజ‌ర్ ఆద్యంతం సాంకేతిక మెరుపులు మైమ‌రిపించాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ప‌నిత‌నం మైమ‌రిపించింది. చిట్టీ ఈజ్ బ్యాక్‌.. అని శంక‌ర్ టీజ‌ర్ రిలీజ్ ముందే ఎందుకు అన్నారో అర్థ‌మైంది. ఈ ప్ర‌పంచాన్ని నాశ‌నం చేసేందుకు దూసుకొస్తున్న పెను విల‌యాన్ని ఆపేందుకు ల్యాబ్‌లోంచి చిట్టీని తిరిగి రీబూట్ చేసి వార్‌లోకి దించ‌డం టీజ‌ర్‌లో క‌నిపించింది. డా.వ‌శీక‌ర‌ణ్ – చిట్టీ జోడీ క్రోమ్యాన్‌(అక్ష‌య్‌కుమార్)ని ఎలా ఎదుర్కొన్నారు? అన్న‌దే ఈ సినిమా క‌థ‌. కొన్ని సెక‌న్ల నిడివి ఉన్న టీజ‌ర్‌లోనే క‌థేంటో జ‌నాల‌కు అర్థ‌మైంది. సినిమా ఆద్యంతం క్రోమ్యాన్ వ‌ర్సెస్ చిట్టీ బ్యాటిల్ అద‌ర‌గొడుతుంద‌ని రివీలైపోయింది. ఇక శంక‌ర్ శైలిలో అత్యంత‌ సామాన్యుడికి అర్థ‌మ‌య్యే రీతిలో ఈ సినిమా క‌థ‌ని, స‌న్నివేశాల్ని శంక‌ర్ చూపిస్తార‌న‌డంలో సందేహం లేదు. 2.ఓ నవంబ‌ర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా టీజ‌ర్‌ని 2డి, 3డిలో రిలీజ్ చేశారు. టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. అదే స్థాయి క్వాలిటీ వ‌ర్క్ సినిమా ఆద్యంతం ర‌క్తిక‌ట్టిస్తుంద‌నే ఆశిద్దాం

User Comments