జ‌గ‌న్ స‌భ‌లో 200 మందికి గాయాలు

Last Updated on by

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌నాలు కుప్ప‌లు తెప్పులుగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఇక ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ నేత చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హించే రోడ్ షోల కంటే వైఎస్ జ‌గ‌న్ స‌భ‌ల‌కే జ‌నం అత్య‌ధిక సంఖ్య‌లో పోటెత్తుతున్నారు. ఇసుక పోస్తే నేల‌పై రాల‌నంత జ‌నం వ‌స్తుండ‌టం గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిందే. తాజాగా బుధ‌వారం జ‌గ‌న్ మండ‌పేట‌లో నిర్వ‌హించిన స‌భ‌లో అప‌శృతి చోటుచేసుకుంది. ఎక్క‌డ చూసినా జ‌న‌సందోహం వుండ‌టం, బిల్డింగ్‌ల‌పై కూడా కుప్ప‌లు తెప్ప‌లుగా జ‌నం ఎక్కి మ‌రీ రోడ్ షోను తికించ‌డానికి రావ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.
ఓ షాపింగ్ కాంప్లెక్స్‌పైకి మితిమీరిన జ‌నం ఎక్క‌డంతో ఒక్క‌సారిగా కుప్ప‌కూల‌డం షాక్‌కు గురిచేసింది. ప్ర‌మాదంలో  మండ‌పేట ఎండీఓ కార్యాల‌యం స‌మీపంలో నివ‌సిస్తున్న పీలే రాముడు(68) అనే వృద్ధుడు మృతిచెందాడు. దాదాపు 200 మంది తీవ్ర గాయాల పాల‌య్యారు. ఏం జ‌రుగుతుందో తెలిసే లోపై జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగిపోయింది. అయితే వెంట‌నే తేరుకున్న యంత్రాంగం క్ష‌త గాత్రుల‌ను స‌మీపంలో వున్న ఆసుప‌త్రుల‌కు వెంట వెంట‌నే త‌ర‌లించారు. వంద‌ల సంక్ష‌లో క్ష‌త‌గాత్రులు వుండ‌టంతో కొంత మందిని రామ‌చంద్రాపురం, మ‌రికొంద‌రిని కాకినాడ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఊహించ‌ని ఘ‌ట‌న‌తో భీతిల్లిన జ‌న‌మంతా త‌మ బంధువుల కోసం ఆసుప‌త్రుల్లో వెత‌క‌డం మొద‌లుపెట్టారు. ప‌లు ఆసుప‌త్రుల ప్రాంగ‌ణాల‌న్నీ బంధువుల ఆర్త‌నాదాల‌తో ద‌ద్ద‌రిల్లుతున్నాయి. మండ‌పేట‌లో జ‌గ‌న్ స‌భ నిర్వ‌హించ‌కూడ‌ద‌ని జ‌న‌సేన అభ్య‌ర్థి వేగుళ్ల లీలాకృష్ణ విఫ‌ల ప్ర‌య‌త్నం చేసిన లాభం లేకుండా పోయింది. హ‌ఠాత్ప‌రిణ‌మానికి కంగుతిన్న జ‌గ‌న్‌, సుబ్బారాయుడు స‌భ‌ను అర్థ్రాంత‌రంగా ముగించుకుని క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రులుకు ప‌రామ‌ర్శించి అక్క‌డ నుంచి హుటా హుటిన హెలికాప్టర్‌లో వెళ్లిపోయారు. మండ‌పేట‌లో జ‌రిగిన ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న మ‌రిన్నిరోడ్ షోల‌కు క‌నువిప్పు కావాల‌ని జ‌నం మండిప‌డుతున్నారు.

User Comments