2018లో మెగా ట్ర‌బుల్స్

Last Updated on by

మెగా ఫ్యామిలీలో 10 మంది స్టార్లు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, మెగా ఫైరింగ్ బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, మెగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుప్రీంహీరో సాయిధ‌ర‌మ్ తేజ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, అల్లు శిరీష్‌, మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్, మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల ఇంత‌మంది స్టార్లు ఉన్నారు. 2018లో వీళ్ల రిపోర్ట్ ఏంటి? అంటే మిశ్ర‌మ ఫ‌లితాలేన‌ని చెప్పొచ్చు.

2018లో మెగా ఫ్యామిలీ నుంచి సీనియ‌ర్లు చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి సినిమాల్లేవ్‌. చిరు `సైరా` చిత్రీక‌ర‌ణ‌లో బిజీ. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ. ఇక మిగ‌తా హీరోల‌ను ప‌రిశీలిస్తే.. మెజారిటీ భాగం మెగా ట్ర‌బుల్స్ త‌ప్ప‌లేద‌నే ఫ‌లితాలు చెబుతున్నాయి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మిన‌హా మిగ‌తా హీరోలంతా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌డంలో త‌డ‌బ‌డ్డారు. రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ సాధించ‌డం, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `తొలి ప్రేమ‌` విజ‌యం సాధించ‌డం కొంత‌వ‌ర‌కూ ఊర‌ట అనే చెప్పాలి.

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సుప్రీంహీరో సాయిధ‌రమ్ తేజ్ మాత్రం వ‌రుస ఫ్లాపుల‌తో బ్యాక్‌బెంచీకి ప‌రిమిత‌మైపోయాడు. 2017, 2018 వ‌రుస సంవ‌త్స‌రాలు అస‌లు అత‌డికి క‌లిసిరాక‌పోవ‌డంతో అభిమానులు నిరుత్సాహానికి గుర‌య్యారు. 2018లో రిలీజైన ఇంటెలిజెంట్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఈ స‌న్నివేశం నుంచి సాయిధ‌ర‌మ్ బ‌య‌ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇక ఇదే ఏడాది ఎన్నో అంచ‌నాల న‌డుమ రిలీజైన `నా పేరు సూర్య‌` బ‌న్ని ఆశ‌ల‌కు గండి కొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకోవ‌డం ఊహించ‌లేనిది. వ‌రుణ్ తేజ్ `తొలి ప్రేమ‌` హిట్ట‌యినా `అంత‌రిక్షం` ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్ర‌యోగాల హీరోగా డేరున్న‌వాడిగా వ‌రుణ్ పేరు మార్మోగిపోతోంది. అల్లు శిరీష్ కి 2017-2018 సీజ‌న్ క‌లిసి రాలేదు. 2017లో వ‌చ్చిన‌ `క్ష‌ణం`, 2018లో వ‌చ్చిన `ఏబీసీడీ` (అనువాదం)చిత్రాలు ఫ్లాప్ షోగా నిలిచాయి. ఇక మెగా ప్రిన్సెస్ నీహారిక కెరీర్ పాకులాట‌లో ఒక్కో అడుగు వేస్తున్నా ఎందుక‌నో త‌డ‌బాటుకు గుర‌వుతోంది. ఈ ఏడాది రిలీజైన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంతో పాటు అటు త‌మిళ చిత్రం ఫ్లాపైంది. మెగా అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ న‌టించిన `విజేత‌` ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ఇక మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓవైపు బుల్లితెర షోల‌తో బిజీగా ఉంటూనే, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న స్థాయిని నిల‌బెట్టుకుంటూ సేఫ్‌గేమ్ ఆడుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

User Comments