షాకిస్తున్న సంక్రాంతి పుంజులు

Last Updated on by

Last updated on May 31st, 2018 at 08:23 am

సంక్రాంతి పుంజులు షాకిస్తున్నాయ్‌! ఓ ర‌కంగా టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. ఇదివ‌ర‌కూ 80-90ల‌లో  సుప్రీంహీరో చిరంజీవి, యువ‌ర‌త్న‌ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు సంక్రాంతి బ‌రిలో రిలీజై పోటీప‌డేవి. ఆ త‌ర‌వాత ఇటీవ‌లి కాలంలో రామ్‌చ‌ర‌ణ్, మ‌హేష్ సినిమాలు పోటీప‌డుతున్నాయి. అయితే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి పోటీప‌డే సినిమాల వివ‌రం తెలిస్తే షాక్ తిన‌డం గ్యారెంటీ. 2019 సంక్రాంతి బ‌రిలో రెండు రాజ‌కీయ ప్ర‌ధాన చిత్రాలు పోటీప‌డుతున్నాయి. అవి రెండు ఇద్ద‌రు మ‌హానేత‌ల బ‌యోపిక్‌లు కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తుతోంది.

స‌రిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందు ఈ సినిమాలు రిలీజ‌వుతుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డుస్తోంది. ఇటీవ‌లే ఎన్టీఆర్‌, వైయ‌స్సార్ బ‌యోపిక్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ రెండు సినిమాలు రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఈ జూన్‌లోనే వైయ‌స్సార్ బ‌యోపిక్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు మ‌హి.వి.రాఘ‌వ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక బాల‌య్య సైతం ఎన్టీఆర్ ద‌ర్శ‌కుడిని ప్ర‌క‌టించి, రెగ్యుల‌ర్ షూటింగుకి రెడీ అవుతున్నారు. వైయ‌స్సార్ పాత్ర‌లో మ‌మ్ముట్టి, ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఇరు సినిమాలపైనా భారీ అంచ‌నాలు పెరిగాయి. అందుకు త‌గ్గ‌ట్టే ప‌క్కా ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి, వేగంగా పూర్తి చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి రిలీజ్‌కి ఈ రెండు బ‌యోపిక్‌ల‌ను రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఇరు సినిమాల‌కు ఫండింగ్ మాత్రం తేదేపా, వైకాపాలు చూసుకుంటున్నాయ‌న్న‌దానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని పాలించిన ఇరువురు ముఖ్య‌మంత్రుల జీవితాల్ని వెండితెర‌పై వీక్షించేందుకు ప్రేక్ష‌కాభిమానులు అంతే క్యూరియ‌స్‌గా ఉన్నారు. స‌రిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వీటిని రిలీజ్ చేస్తుండ‌డం వేడి పెంచుతోంది. అయితే జ‌నాలు సినిమాలు చూసి ఓటేస్తారా? అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

User Comments