అమెరికా ప్రీమియ‌ర్ల‌తో 2కోట్లు

Last Updated on by

కీర్తి సురేష్ న‌టించిన `మ‌హాన‌టి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై, క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఇదో క్లాసిక్ సినిమా, మాస్‌కి ఎక్కుతుందా? అంటూ తొలిరోజు డివైడ్ టాక్ వినిపించినా, అమ్మ సావిత్రి అభిమానులు కంక‌ణం క‌ట్టుకుని ఈ సినిమాని స‌క్సెస్ చేసేందుకు ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చేస్తున్నారు. ఒక య‌థార్థ‌క‌థ‌ను ఉన్న‌దున్న‌ట్టు చూపించే సాహ‌సం వైజ‌యంతి మూవీస్ చేసింద‌న్న టాక్ న‌డుమ అస‌లు సావిత్రి జీవితం ఎలా ఉంటుందో చూడాల‌న్న కుతూహాలం పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టే ఇంటా బ‌య‌టా ఈ సినిమా అద్భుత వ‌సూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ నుంచి క‌లెక్ష‌న్ల‌ రిపోర్ట్ బావుంది.

అమెరికాలో దాదాపు 150 లొకేష‌న్ల‌లో ఈ సినిమా రిలీజైతే ప్రీమియ‌ర్ల రూపంలో ఏకంగా 303కె డాల‌ర్లు క‌లెక్ట‌య్యింది. రూపాయ‌ల్లో గ‌ణిస్తే 2.04 కోట్లు అమెరికాలో వ‌సూలు చేసింది. ఇది కేవ‌లం ప్రీమియ‌ల‌ర్ల వ‌సూళ్లు, డే1 క‌లెక్ష‌న్స్ అద‌నం. ఇక అమెరికా ప్రీమియ‌ర్లలో అజ్ఞాత‌వాసి, భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం చిత్రాలు టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానం `మ‌హాన‌టి` ద‌క్కించుకుంది. ఆ మేర‌కు ట్రేడ్‌లో చ‌క్క‌ని టాక్ వినిపిస్తోంది. ఈ వీకెండ్ `మ‌హాన‌టి` హ‌వా సాగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే సోమ‌వారం నుంచి అస‌లు సిస‌లు ప‌రీక్ష మొద‌ల‌వుతుంది. అప్ప‌టికి మాస్ ఆడియెన్‌ని థియ‌ట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగితే ఈ సినిమా ఫుల్‌ర‌న్‌లో సేఫ్ ప్రాజెక్టుగా నిలుస్తుంద‌ని క్రిటిక్స్‌, ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

User Comments