రెండు జంట‌ల ఫ‌న్‌ & ఫ్రస్ట్రేష‌న్‌

Last Updated on by

విక్ట‌రీ వెంక‌టేష్ – త‌మ‌న్నా జంట‌గా అనీల్ రావిపూడి `ఎఫ్ 2-ఫ‌న్‌& ఫ్రస్ట్రేష‌న్‌` తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌- మెహ్రీన్ వేరొక జంట‌గా న‌టిస్తున్నారు. వెంకీ- మిల్కీ భార్యా భ‌ర్త‌లుగా న‌టిస్తుంటే, వ‌రుణ్‌-మెహ్రీన్ నిశ్చితార్థం అయిన జంట‌గా న‌టిస్తున్నారు. రెండు జంట‌లు .. అదే ప‌నిగా కొట్టుకుంటుంటే.. ఆ ఫ్ర‌స్టేష‌న్ లోంచి పుట్టే కామెడీ ఎలా ఉంటుందో అనీల్ రావిపూడి తెర‌పై అద్భుతంగా చూపిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో హిలేరియ‌స్ కామెడీ వ‌ర్క‌వుటైంద‌ని తెలుస్తోంది. వెంకీ మ‌రోసారి త‌న‌దైన మార్క్ హాస్యంతో అల‌రించ‌నున్నారుట‌. ఇక ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ మునుప‌టితో పోలిక లేకుండా చాలా కొత్త‌గా రొమాంటిక్ బోయ్‌గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. మొగుడ్స్ – పెళ్లామ్స్ మ‌ధ్య గొడ‌వ‌లు, ఫ్రస్ట్రేష‌న్‌తో పాటు, రొమాన్స్‌ని హైలైట్‌గా ఎలివేట్ చేస్తున్నార‌ట‌.

అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన `ప‌టాస్‌`, `రాజా ది గ్రేట్‌` సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఆ రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌లో అర్థవంత‌మైన కామెడీ, ఎమోష‌న్‌ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపించింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ రిజ‌ల్ట్‌ని అనీల్ రావిపూడి నుంచి ఎదురు చూడొచ్చ‌ని చెబుతున్నారు. మొత్తానికి వెంకీని తిరిగి ట్రాక్‌లోకి తెస్తున్న యువ‌ద‌ర్శ‌కుడిగా రావిపూడిపై పాజిటివ్ సైన్ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో రిలీజ్‌కి రానున్న ఈ సినిమా గురించి అధికారికంగా మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.

User Comments