2.0పై కోపంగా ఉన్న నిర్మాత‌లు..

ఇప్ప‌టికే అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల్లో కూడా 2.0 సినిమా విడుద‌ల‌పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుందో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఈ సినిమా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ అయింద‌ని వార్త‌లు వినిపించాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై చిత్ర‌యూనిట్ క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం ఇవ్వ లేదు. మ‌రోవైపు అక్ష‌య్ న‌టించిన పద్మన్ సినిమా జ‌న‌వ‌రి 26న రానుండ‌టంతో.. ఇదే 2.0 వాయిదాకు సాక్ష్యంగా నిలిచింది. ఎందుకంటే 2.0లో అక్ష‌య్ కూడా న‌టించాడు కాబ‌ట్టి.. చూస్తూ చూస్తూ త‌న సినిమాకే తాను పోటీ రాడు క‌దా..! అయితే ఇప్పుడు అక్ష‌య్ కుమార్ కూడా త‌న సినిమా విడుద‌ల‌పై క‌న్ఫ్యూజ‌న్ పెంచేసాడు. పద్మన్, 2.0 మాత్రం ఒకేసారి రావు.. కానీ జ‌న‌వ‌రి 26నే త‌న సినిమా కూడా వ‌స్తుంద‌నే క్లారిటీ ఇవ్వ‌లేన‌ని చెప్పాడు అక్ష‌య్ కుమార్. పైగా ఎప్రిల్ 13కి 2.0 పోస్ట్ పోన్ అయింద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ అఫీషియ‌ల్ గా సినిమా యూనిట్ అనౌన్స్ చేయ‌లేదు క‌దా..! 2.0 చెప్పిన టైమ్ కే వ‌స్తుంద‌నే వార్త‌లు ఇప్పుడు త‌మిళ‌నాట జోరుగా వినిపిస్తున్నాయి.

అక్ష‌య్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు 2.0 విడుద‌ల‌పై మ‌ళ్లీ ఆస‌క్తి మొదలైంది. పైగా మిగిలిన ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా 2.0 చిత్ర నిర్మాత‌ల‌పై కోపంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చూస్తూ చూస్తూ ర‌జినీకాంత్ సినిమాకు ఎవ‌రూ పోటీ రారు. అలాంటి టైమ్ లో మూడు నెలల ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. దాన్ని బ‌ట్టి త‌మ సినిమాల‌ విడుద‌ల‌ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటాం క‌దా అని కొంద‌రు 2.0 నిర్మాత‌ల‌ను కోరుతున్నారు. కానీ వాళ్లు మాత్రం స్పందించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ పై కొంద‌రు నిర్మాత‌లు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ లో కేస్ వేయ‌డానికి కూడా రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. అంతేకదా.. రిలీజ్ డేట్ విష‌యంలో ఇలా ఆడుకుంటే అంద‌రికీ టెన్ష‌నే క‌దా..!

మ‌రోవైపు ప్ర‌ముఖ త‌మిళ సినీ విశ్లేష‌కుడు శ్రీ‌ధ‌ర్ పిళ్లై త‌న ట్విట్ట‌ర్ లో జ‌న‌వ‌రి 25నే 2.0 రాబోతున్న‌ట్లు అనౌన్స్ చేసారు. ఆయ‌న చాలా సీనియ‌ర్. అస‌లు అలాంటి వ్య‌క్తి అంత గుడ్డిగా 2.0 జ‌న‌వ‌రి 25నే వ‌స్తుంద‌ని రాయ‌డు క‌దా..! పైగా క‌న్ఫ‌ర్మ్ అనే వార్త కూడా ట్వీట్ చేసాడు. శ్రీ‌ధ‌ర్ ట్వీట్ తో ఇప్పుడు త‌మిళ‌నాట మ‌ళ్లీ కొత్త చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అస‌లు ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారు..? నిజంగానే 2.0 ముందు చెప్పిన తేదీకి వ‌స్తుందా..? మ‌రోవైపు ఎలాగూ అక్ష‌య్ త‌న సినిమా 2.0తో పోటీ ప‌డ‌దు అని క్లారిటీ ఇచ్చాడు. ఇవ‌న్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాస్త ఆలోచిస్తే శ్రీ‌ధ‌ర్ పిళ్లై చెప్పిన దాంట్లోనూ నిజం లేదు. ఇప్ప‌టికే 2.0 ఆడియో విడుద‌లైంది. పైగా సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా చివ‌రికి వ‌చ్చేసింది. మ‌రో రెండు నెల‌ల‌కు పైగా టైమ్ ఉంది. నిజంగానే శంక‌ర్ అనుకున్న టైమ్ కు సినిమాను పూర్తి చేస్తాడేమో..? ఏమో చివ‌రి వ‌ర‌కు ఏం చెప్ప‌లేం..? స‌్వ‌యంగా శంక‌ర్ నోరు విప్పి చెప్పేవ‌ర‌కు 2.0 విడుద‌ల తేదీపై క‌న్ఫ్యూజ‌న్ మాత్రం కంటిన్యూ కావ‌డం ఖాయం.