సాహో కి 30శాతం రిబేట్‌?

Last Updated on by

ప్ర‌భాస్ & `సాహో` టీమ్ నిన్న‌టిరోజున అబూద‌బీలో టుఫోర్ 54 కంపెనీ ప్ర‌తినిధుల‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు కంపెనీ ప‌నితనానికి మ‌న డార్లింగ్ అద్భుత‌మైన కాంప్లిమెంట్ ఇచ్చాడు. అయితే ఆ కంపెనీ అక్క‌డ సాహో టీమ్ కోసం ఏం చేసింది? అంటే .. స‌ర్వం త‌నే అయ్యి ద‌గ్గ‌రుండి చూసుకుంది. టుఫోర్ 54 అనేది అంత‌ర్జాతీయ స్థాయి ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ కంపెనీ. గుండు సూది నుంచి లొకేష‌న్‌లో అవ‌స‌ర‌మైన ప్ర‌తి ప్రాప‌ర్టీని ఈ సంస్థ అందిస్తుంది. అస‌లే సాహో కోసం కెన్నీబేట్స్ సార‌థ్యంలో దుబాయ్‌, అబుద‌బీ లో 50 రోజుల సుదీర్ఘ నిడివితో భారీ యాక్ష‌న్ ఛేజ్ దృశ్యాల్ని చిత్రీక‌రించారు. అలాంటి చోట ఎప్పుడు ఏ అవ‌స‌రం ప‌డుతుందో తెలీదు. వాట‌న్నిటినీ స‌మ‌కూర్చ‌డంలో స‌ద‌రు కంపెనీ ప‌నిత‌నం ఎంతో గొప్ప‌ద‌నేది ప్ర‌భాస్‌-సుజీత్ బృందం ఉద్ధేశం.
అదంతా అటుంచితే … అబుద‌బీ.. ఎమిరేట్స్‌లో సుదీర్ఘ‌కాలం తెర‌కెక్కించిన ఏకైక సినిమా ఏది? అంటే అది మ‌న `సాహో` అనే మాట వినిపిస్తోంది. అక్క‌డ ఏకంగా 250 మంది పైగా క్రూతో దాదాపు 50రోజుల పాటు సుదీర్ఘంగా చిత్రీక‌ర‌ణ చేశారు. స‌ల్మాన్ భాయ్‌- య‌శ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన `టైగ‌ర్ జిందా హై`ని 20 రోజుల పాటు అక్క‌డ చిత్రీక‌రించారు. ఆ త‌ర‌వాత అంత‌కుమించి లాంగ్ షెడ్యూల్ చేసింది `సాహో`కోస‌మే. దిష్యూం, బేబి, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాల్ని ఇక్క‌డ కొద్దిరోజుల చిత్రీక‌ర‌ణ చేశారు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ `రేస్ 3` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక‌పోతే హాలీవుడ్ సినిమాల్లో యూనివ‌ర్శ‌ల్ పిక్చ‌ర్స్‌ `ఫ్యూరియ‌స్ 7`, డిస్నీ నిర్మించిన `స్టార్ వార్స్‌-ది ఫోర్స్ ఎవేకెన్స్‌` చిత్రాల్ని ఈ లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించారు. అబూద‌బీలో 50రోజుల షూట్‌కి 30శాతం రిబేట్ వెన‌క్కి వ‌స్తుందిట‌. ఆ మేర‌కు యువి క్రియేష‌న్స్‌ నిర్మాత‌ల‌కు హ్యాపీనే. టైగ‌ర్ జిందా హై త‌ర‌వాత లాంగెస్ట్ షెడ్యూల్స్ సాహోకే.. పైగా అబూద‌బీలో ఇంత సుదీర్ఘంగా షూట్ చేసిన ఏకైక ఇండియన్ సినిమా, సౌతిండియా సినిమా కూడా సాహోనే..

User Comments