ఆడాళ్ల‌ మోసాల‌పై క‌మెడియ‌న్‌ ఫైర్‌

Last Updated on by

30 ఇయ‌ర్స్ పృథ్వీ ట్యాలెంట్ గురించి తెలిసిందే. ద‌శాబ్ధ కాలంగా పృథ్వీ హ‌వా సాగుతోంది. క్ష‌ణం తీరిక లేనంత బిజీ ఆర్టిస్టుల్లో పృథ్వీ కూడా ఒక‌డు. గ‌త ఏడాది 40 సినిమాల్లో న‌టించిన పృథ్వీ .. ఈ ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు చేశాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన బ్ల‌ఫ్ మాష్ట‌ర్ రిలీజ్‌కి వ‌స్తున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు.

మీటూ ఉద్యమం.. కాస్టింగ్ డైరెక్ట‌ర్ల‌పై ఆరోప‌ణ‌ల గురించి ప్ర‌శ్నిస్తే పృథ్వీ త‌న‌దైన శైలిలో ఫైర‌య్యారు. అస‌లు మ‌గాళ్ల మోసాల గురించి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి కానీ, అంత‌కంటే ఎక్కువ మోసాలు చేసేది ఆడాళ్లే. కానీ వాటి గురించి మాట్లాడుతున్నారా? అని సీరియ‌స్ అయ్యారు. ఇక‌పోతే ఇలాంటి దుష్ప్ర‌చారం వ‌ల్ల అస‌లు లేడీ ఆర్టిస్టు అంటేనే ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. ఇటీవ‌లి కాలంలో మణికొండ లాంటి చోట్ల అస్స‌లు ఇల్లు అద్దెకు ఇవ్వాలంటేనే ఓన‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నార‌ని చెప్పారు. ఎవ‌రైనా ఫోన్ చేస్తే ఓం సాయిరాం అని త‌ప్పించుకోవాల్సొస్తోంద‌ని, లేదంటే టీవీ చానెల్ లైవ్‌లో ఆ ఆడియో వ‌చ్చేస్తోంద‌ని పృథ్వీ చెప్పాడు. త‌న‌తో పాటే సీనియ‌ర్ న‌టులంతా ఇదే పద్ధ‌తిని అనుస‌రిస్తున్నార‌ని అన్నారు.

User Comments