సాహోరే.. 37 కార్లు నుజ్జు నుజ్జు

Last Updated on by

భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలకు మంచి నీళ్ల ప్రాయంగా బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. కార్ ఛేజ్‌.. బైక్ ఛేజ్‌.. ట్ర‌క్ ఛేజ్ .. లేదా ఇంకేదైనా భారీ వాహ‌నం ధ్వంశం కావాలంటే ఆ ఖ‌ర్చు అంత‌కంత‌కు పెరిగి నాలుగింత‌లు అవుతుంది. అయితే అదంతా ముందే గ్ర‌హించిన యు.వి.క్రియేష‌న్స్ `సాహో` చిత్రం యాక్ష‌న్ కోస‌మే మెజారిటీ బ‌డ్జెట్‌ని వెచ్చించింది. ఈ సినిమా కోసం ఊహాతీతంగా 300కోట్ల బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేస్తున్న‌ స‌ద‌రు సంస్థ అందులో స‌గం యాక్ష‌న్‌, ఛేజ్ దృశ్యాల‌కే ఖ‌ర్చు చేస్తుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది. దీన‌ర్థం ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌రో మ్యాట్రిక్స్‌, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ త‌ర‌హా సినిమా చూడ‌బోతున్నామ‌నే. ది గ్రేట్ యాక్ష‌న్ మూవీ ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ కు యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేసిన కెన్నీ బేట్స్ సాహోకి ఫైట్స్ అందించ‌డం మ‌రో హైలైట్‌.

అదంతా అటుంచితే ప్ర‌స్తుతం చిత్ర‌యూనిట్ దుబాయ్‌లో భారీ ఛేజ్ దృశ్యాల్ని తెర‌కెక్కిస్తోంది. అక్క‌డ ఓ భారీ ఫ్లైఓవ‌ర్‌పై ట్ర‌క్ ఛేజ్ దృశ్యాల్ని చిత్రీక‌రించింది. ఇందుకోసం భారీ ట్ర‌క్‌లు, బైక్‌లు, ల‌గ్జ‌రీ కార్లు ఉప‌యోగించారు. తాజా రిపోర్ట్ ప్ర‌కారం.. దాదాపు 37 కార్లు ఈ ఫైట్ సీక్వెన్సెస్ తెర‌కెక్కించే క్ర‌మంలో నుజ్జు నుజ్జు అయ్యాయ‌ని తెలుస్తోంది. ఇందులో నాలుగు ట్ర‌క్‌లు, ఎస్‌యువిలు ఉన్నాయి. అంటే ఇక కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ అవ‌స‌రం లేకుండానే ఒరిజిన‌ల్‌గా లైవ్‌లో యాక్ష‌న్ అద‌ర‌గొట్టేశార‌నే అర్థ‌మ‌వుతోంది. ఈ ఎపిసోడ్స్ కోసం ప్ర‌భాస్ త‌న లైఫ్‌నే రిస్క్ చేయడంపైనా, స్వీటీ అనుష్క అత‌డిని వారించేందుకు దుబాయ్ వెళ్ల‌డంపైనా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2019 ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా బ‌హుభాష‌ల్లో రిలీజ్ కానుంది.

User Comments