త్రీఇడియ‌ట్స్ లింకేంటి?

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ 25 ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అయితే ఈ సినిమాకి త్రీఇడియ‌ట్స్ ఇన్‌స్పిరేష‌న్ అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇందులో మ‌హేష్ – అల్ల‌రి న‌రేష్ స్నేహం కాన్సెప్టుకి త్రీఇడియ‌ట్స్ స్ఫూర్తినిచ్చింద‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం సాగిస్తోంది. అయితే ఇది నిజ‌మా?

ఒక‌వేళ వంశీ పైడిప‌ల్లి త్రీఇడియ‌ట్స్ ఫ్రెండ్షిప్‌ని య‌థాత‌థంగా తీయాల‌నుకుంటే ఆ సినిమా రీమేక్ హ‌క్కులు తీసుకునేవాడేమో. ప్ర‌స్తుతం కాపీరైట్ యాక్ట్ అంతే బ‌లంగా ఉంది కాబ‌ట్టి, ఏదీ కాపీ కుద‌ర‌దన్న‌ది అత‌డికి తెలుసు. ఇక‌పోతే ఇదివ‌ర‌కూ వంశీ తెర‌కెక్కించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `ఊపిరి`కి ఫ్రెంచి సినిమా కాపీ రైట్స్ తీసుకుని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇక త్రీ ఇడియ‌ట్స్‌లో ముగ్గురు హీరోల మ‌ధ్య స్నేహం… మ‌హేష్ 25లో ఇద్ద‌రు హీరోల మ‌ధ్య స్నేహం.. కాబ‌ట్టి ఈ పోలిక స‌రికాద‌నే భావించ‌వ‌చ్చు. త్రీఇడియ‌ట్స్ విద్యావ్య‌వ‌స్థ‌పై తీసిన సినిమా అయితే, ఇది పూర్తిగా రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న సినిమా. కాబ‌ట్టి ఎమోష‌న్స్ ప‌రంగా ఫ్రెండ్షిప్ సీన్స్ లో రిజంబ్లెన్స్ ఉండొచ్చేమో కానీ, సోల్ మాత్రం పూర్తిగా వేరేగా ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ రూమ‌ర్ల‌పై పైడిప‌ల్లి ఏం ఆన్స‌ర్ ఇస్తారో?

User Comments