ఇలియానాకు ఇక అఅఆ!

Last Updated on by

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని (అఅఆ) ఓ ముగ్గురి జీవితాల‌తో ముడిప‌డిన‌ ఎంతో కీల‌క‌మైన సినిమా ఇది. మాస్ మ‌హారాజా ర‌వితేజ, స‌న్న‌జాజి ఇలియానా, ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల .. ఈ ముగ్గురికి గ్రేట్ కంబ్యాక్‌ని ఇవ్వాల్సిన సినిమా ఇది. అందుకే ట్రేడ్ వ‌ర్గాలు స‌హా కామ‌న్ జ‌నం క‌ళ్లు అటువైపే ఉన్నాయి. ఒక హిట్టు, రెండు ఫ్లాప్‌లు అన్న చందంగా సాగుతున్న ర‌వితేజ‌కు త‌ప్ప‌నిస‌రిగా బ్లాక్‌బ‌స్ట‌ర్ ద‌క్కాల్సిన సంద‌ర్భమిది. మ‌రోవైపు త‌న‌ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చిన ర‌వితేజ‌కు బ్యాడ్‌నేమ్ తేకుండా హిట్టివ్వ‌డ‌మే గాక‌, వ‌రుస ప‌రాభ‌వాల నుంచి తాను కంబ్యాక్ అవ్వాల్సిన ఛాలెంజింగ్ సంద‌ర్భం వైట్ల ముందు ఉంది. ఖ‌త‌ర్నాక్‌, దేవుడు చేసిన మ‌నుషులు ప‌రాజ‌యాల‌తో ఇలియానా ఐరెన్‌లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. దానిని అఅఆ చిత్రంతో చెరిపేయాల్సి ఉంది.

ఆ క్ర‌మంలోనే విదేశీ షూటింగులు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ 5 నాటికి స్వ‌దేశంలో అడుగుపెట్ట‌నుంది చిత్ర‌బృందం. అటుపై మాస్ రాజా స‌మేతంగా ఇలియానా న‌గ‌రంలో అఅఆ మొద‌లుపెడుతుంది. సెప్టెంబర్ చివ‌రి నాటికే అన్నిప‌నులు పూర్తి చేసి, అక్టోబ‌ర్‌లో ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసే ఆలోచ‌న ఉంది కాబ‌ట్టి, ఆ మేర‌కు వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నార‌ట‌. ర‌వితేజ – వైట్లు కాంబోకి తిరిగి వెంకీ, దుబాయ్ శీను రోజులు తిరిగొస్తాయేమో చూడాలి.

User Comments