సినీహీరో బినామీకి అమ‌రావ‌తిలో 499 ఎక‌రాలు?

ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్.. అంటే ఒక ప్రాంతంలో ప్ర‌భుత్వ పాల‌సీల్ని ముందే లీక్ చేయ‌డం ద్వారా ఆ ఏరియాలో భూముల్ని కొన‌డం.. వ్యాపారాల్ని వృద్ధి చేయ‌డం వ‌గైరా వ‌గైరా ఈ ప‌రిధిలోకి వ‌స్తాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌క‌టించక ముందే ఈ కేట‌గిరీలో భూములు కొన్న తేదేపా నాయ‌కుల పీచ‌మ‌ణిచే ప‌నిలో ఏపీ సీఎం వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు.

క్విడ్ ప్రోకో.. నీక ఇది ఇస్తే నాకు అది ఇవ్వు! ప్రాతిప‌దిక‌న అమ‌రావ‌తి భూముల్ని తేదేపా నాయ‌కులు కొట్టేసిన‌ట్టుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు అండ్ కోపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ సాగ‌నుంద‌న్న వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ లో ప‌లువురు మంత్రుల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. `ఎంపరర్ ఆఫ్ కరప్షన్- రాజధాని భూ దోపిడీ` అంటూ తాజాగా సినీ క్రిటిక్ .. పొలిటీషియ‌న్ కత్తి మహేష్ విడుదల చేసిన భూ దోపిడీ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.  ఈ జాబితాలో మాజీ మంత్రి నారాయణ ఏకం గా 432 కోట్లతో 3129 ఎకరాలు కొన్నార‌ని వెల్ల‌డించారు. నారా లోకేష్ 50 కోట్లు పెట్టి 500 ఎకరాలు, పత్తిపాటి 196 ఎకరాలు, సుజనాచౌదరి 700 ఎకరాలు, రావెల కిషోర్ బాబు 55 ఎకరాలు, మురళీమోహన్ 53 ఎకరాలు శ్రీధర్ బాబు 42 ఎకరాలు కోడెల శివరామ్ 17.3 ఎకరాలు దూళిపాల్ల 50 ఎకరాలు పయ్యావుల కేశవ్ 4.09 ఎకరాలు, లింగమనేని రమేశ్ 804 ఎకరాలు కొన్నార‌ట‌. చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య బంధువైన రామారావు 499 ఎక‌రాలు కొన్నార‌ట‌.