రిప‌బ్లిక్ డే టార్గెటెడ్‌

Last Updated on by

2019 జ‌న‌వ‌రిని బ‌యోపిక్‌ల మంథ్‌గా ప్ర‌క‌టించాలి. ఎందుకంటే ఒకే నెల‌లో దాదాపు ఐదు బ‌యోపిక్‌లు రిలీజ‌వుతున్నాయ్‌. టాలీవుడ్‌లో అత్యంత క్రేజీగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్‌, యాత్ర బ‌యోపిక్‌లు 2019 జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా రిలీజ్‌కి రానున్నాయి. ఇక బాలీవుడ్‌లోనూ ప‌లు క్రేజీ బ‌యోపిక్‌లు జ‌న‌వ‌రిలో రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ్ కానుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ వీర‌త్వంపై తెర‌కెక్కుతున్న `మ‌ణిక‌ర్ణిక‌`, గ‌ణిత శాస్త్ర మేధావి ఆనంద్‌కుమార్ జీవిత‌క‌థ‌తో రూపొందుతున్న `సూప‌ర్ 30`, మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన‌ అధిప‌తి, రాజ‌కీయ నాయ‌కుడు బాలా సాహెబ్ థాక్రే జీవిత‌క‌థ ఆధారంగా రూపొందుతున్న `థాక్రే` చిత్రాలు జ‌న‌వ‌రిలో రిప‌బ్లిక్ డేని టార్గెట్ చేసి రిలీజ్‌కి వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ క్రేజీ బ‌యోపిక్‌లు. వంద‌ల కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుని క్రేజీగా రిలీజ్‌కి వ‌స్తున్నాయి. ఝాన్సీరాణిగా కంగన‌, గ‌ణిత మేధావిగా హృతిక్, థాక్రే పాత్ర‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖి న‌టించ‌డంతో ఈ సినిమాల‌కు క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోంది. బిజినెస్‌కి త‌గ్గ‌ట్టే భారీ వ‌సూళ్లను సాధించే చిత్రాలుగా అంచ‌నా వేస్తున్నారు. ఇవ‌న్నీ గంప‌గుత్త‌గా దాదాపు 1000 కోట్ల మేర‌ బిజినెస్ పూర్తి చేసుకుంటాయ‌న్న అంచ‌నా ఉంది. ఆ క్ర‌మంలోనే ఇవ‌న్నీ ఎన్ని వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తాయో? అన్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇక ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న తెలుగు సినిమా ఎన్టీఆర్‌, వైయ‌స్సార్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న యాత్ర చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్‌హిట్లు కొడ‌తాయ‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

User Comments