15డేస్‌.. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో పింక్ రీమేక్ తెర‌కెక్క‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు-బోనీక‌పూర్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ కాల్షీట్లు  కేటాయించాక‌ రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ కానుంది.  దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తోన్న చిత్ర‌మిది.  ప‌వ‌న్ రాజ‌కీయంగా బిజీగా ఉన్నా వాట‌న్నిటినీ ప‌క్క‌న‌బెట్టి అభిమానుల కోసం చేస్తున్న  చిత్ర‌మిది. మ‌రి ఈ సినిమాకు ప‌వ‌న్ పారితోషికం ఎంత‌? రెండేళ్ల గ్యాప్ ప‌వ‌న్ మార్కెట్ పై ఏదైనా ప్ర‌భావం చూపిందా? అంటే.. తెలిసిన సంగ‌తులివి..

ఈ సినిమాకు ప‌వ‌న్ కేవ‌లం 15 రోజులు మాత్రమే కేటాయించాడుట‌. అందుకు గాను 50 కోట్లు పారితోషికం ఛార్జ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీన్ని బ‌ట్టి ప‌వ‌న్ ఇమేజ్ గ‌తం క‌న్నా రెట్టింపు అయింద‌నే భావించాలి. ప‌వ‌న్ ఒక్కో సినిమాను రూ. 20 -25 కోట్ల మ‌ధ్య‌లో తీసుకునే వారు.  కానీ పింక్ రీమేక్ కు తీసుకుంటోన్న పారితోషికం చూస్తుంటే రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ చేశార‌నే తెలుస్తోంది. ప‌వ‌న్ పొలిటిక‌ల్ గా బిజీ అయిన త‌ర్వాత ఆయ‌న క్రేజ్ మ‌రింత పెరిగింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిత్యం ఆయ‌న చేసే పోరాటం ప్ర‌తి ఒక్కరిలో స్ఫూర్తి ర‌గిలిస్తోంది. ఆ ర‌కంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా ప‌వ‌న్ కు కామ‌న్ మేన్ కి బాగా క‌నెక్ట్ అయ్యాడు.

ఇప్పుడా క్రేజ్ తోనే  పారితోషికం రెట్టింపు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ ప‌వ‌న్ గురించి మ‌రో విష‌యం చెప్పాలి.  సినిమా విజ‌యం సాధిస్తే ప‌వ‌న్ క్రేజ్ దృష్ట్యా వంద కోట్లు పైగా వ‌సూళ్లు తీసుకొస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది జ‌ర‌గ‌క‌పోతే మినిమం వ‌సూళ్లైనా ప‌వ‌న్ సినిమాకుంటాయి. సినిమా మ‌రీ ప్లాప్ అయితే ప‌వ‌న్ తీసుకున్న పారితోషికంలో చిల్లిగ‌వ్వ కూడా తీసుకోకుండా తిరిగిచ్చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కాబ‌ట్టి ఎలా చూసినా ప‌వ‌న్ వ‌ల్ల నిర్మాత‌ల‌కే మేలే. అందుకే ప‌వ‌న్ ఛార్జ్ చేసినంత నిర్మాత‌లు క‌ళ్లు మూసుకుని చెల్లిస్తున్న‌ట్లు అభిమానులు  అభిప్రాయ‌ప‌డుతున్నారు.