5రోజుల్లో 50కోట్ల షేర్ క్ల‌బ్‌

Last Updated on by

ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత` ఇరు తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కేవ‌లం 5రోజుల్లో 50కోట్ల షేర్ క్ల‌బ్‌లో ప్ర‌వేశించింద‌ని ప్ర‌ఖ్యాత ఆంధ్రా బాక్సాఫీస్ రిపోర్ట్ వెల్ల‌డించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ వివ‌రాల్ని ప‌రిశీలిస్తే…

నైజాం – 15కోట్లు, సీడెడ్ -11.81కోట్లు, వైజాగ్ -5.93కోట్లు, తూర్పు గోదావ‌రి- 4.29కోట్లు, ప‌శ్చిమ‌గోదావ‌రి- 3.52కోట్లు, కృష్ణ‌- 3.77కోట్లు, గుంటూరు – 6.37కోట్లు, నెల్లూరు – 1.96కోట్లు వ‌సూలైంది. ఏపీ-నైజాం క‌లుపుకుని 52.65కోట్ల షేర్ వ‌సూలైంద‌ని ఆంధ్రా బాక్సాఫీస్ డిక్లేర్ చేసింది. ఇది నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో బెస్ట్ రిజ‌ల్ట్. అయితే `అర‌వింద స‌మేత‌` 100కోట్ల షేర్ క్ల‌బ్‌లో ప్ర‌వేశిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ముందున్న టాస్క్‌. ద‌స‌రా బ‌రిలో `పందెంకోడి 2` భారీ హైప్‌తో రిలీజ‌వుతోంది. అభిమన్యుడు లాంటి క్లాసిక్ హిట్ అందుకున్న విశాల్ ఈసారి మాస్‌లో మాసివ్ హిట్ అందుకోవాల‌న్న క‌సితో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఆ సినిమా ప్ర‌భావం అర‌వింద‌పై ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సేమ్ టైమ్ సెల‌వు దినాలు `అర‌వింద స‌మేత‌- వీర రాఘ‌వ‌`కు క‌లిసొచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

User Comments