`ఎన్టీఆర్` బ‌యోపిక్‌కి బంప‌రాఫ‌ర్‌

Last Updated on by

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌లో టైటిల్ పాత్ర‌ను పోషిస్తూ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఈ సినిమాని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విద్యాబాల‌న్, ప్ర‌కాష్‌రాజ్ స‌హా ప‌లువురు ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్ని ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్నారు. అంతే వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసి, రెండో షెడ్యూల్‌ని వేగంగా పూర్తి చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే జ‌న‌వ‌రి 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

అంత‌కు చాలా ముందే ఈ సినిమా బిజినెస్ పూర్తి కానుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఈ సినిమాకి ప్ర‌ఖ్యాత రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సోని వంటి సంస్థ‌లు ఏకంగా 85 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చి పోటీకి దిగాయ‌ని తెలుస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ స‌హా అన్ని భాష‌ల హ‌క్కుల‌కు ఇంత మొత్తం చెల్లించేందుకు రెడీ అయ్యాయిట‌. అయితే మేక‌ర్స్ మాత్రం 100కోట్లకు ఏమాత్రం త‌గ్గ‌కుండా రిలీజ్ హ‌క్కుల్ని విక్ర‌యించాల‌ని చూస్తున్నార‌ని తెలిసింది.

User Comments