90ఎంఎల్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  కార్తికేయ‌, నేహా సోలంకి, రావు ర‌మేష్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 06-12-2018
బ్యాన‌ర్:  కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌డి కొండ‌
ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ రెడ్డి

ముందు మాట‌:
ఆర్.ఎక్స్ 100 చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న కార్తికేయ‌కు ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఫ్లాపులు ఎదుర‌య్యాయి. ఆ క్ర‌మంలోనే నాని గ్యాంగ్ లీడ‌ర్ లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. కానీ సోలోగా కంబ్యాక్ అవ్వాల్సిన టైమ్ లో అత‌డు న‌టించిన 90 ఎం.ఎల్ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలోనే సినిమా కూడా ఆక‌ట్టుకుందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ క‌మామీషు:

కార్తికేయ‌కు పుట్టుక‌తోనే ఓ అరుదైన‌ డిజార్డ‌ర్. 90ఎం.ఎల్ ఆల్క‌హాల్ ప‌డ‌నిదే బ‌త‌క‌లేడు. దీంతో డెయిలీ మూడుసార్లు 90ఎం.ఎల్  ప్రిస్కిప్ష‌న్ ప్ర‌కారం ప‌డాల్సిందే. అలాంటి అరుదైన డిజార్డ‌ర్ తో పెరిగిన ఆ కుర్రాడికి ఒక అంద‌మైన అమ్మాయి (నేహా సోలంకి) ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారాక అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అస‌లు ఎలాంటి చెడు అల‌వాట్లు ఉంటే ద‌రికి చేర‌నివ్వ‌ని కాంప్లికేటెడ్ కుటుంబంలో అమ్మాయిని పెళ్లాడాలంటే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లే కార్తికేయ‌కు ఎదుర‌వుతాయి. అయితే చివ‌రికి త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని ప్రియురాలిని ద‌క్కించుకున్నాడా లేదా?  ఈ క‌థ‌లోనే విల‌న్లు ర‌వికిష‌న్- అజ‌య్ ఎంట్రీ  ఎలాంటిది? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

రేర్ డిజార్డ‌ర్ ఉన్న కుర్రాడిగా ఈ సినిమాలో కార్తికేయ అద్భుతంగా ఒదిగిపోయి న‌టించాడు. అత‌డి ఇలాంటి డిజార్డర్ వల్ల ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్న‌ది చ‌క్క‌గానే చూపారు. ఫ‌స్టాప్ యావ‌రేజ్. చక్క‌ని రొమాన్స్ పాట‌లు కామెడీ ఆక‌ట్టుకున్నాయి. సినిమా ఆరంభ ఎత్తుగ‌డ బావున్నా.. ఆ త‌ర్వాత క‌థ‌ను న‌డ‌ప‌డంలోనే ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా నిరాశ‌ప‌రుస్తుంది. ఒక మంచి క‌థ‌ను ఎంచుకుని ఎందుక‌నో త‌డ‌బ‌డ్డారు. సెకండాఫ్ లో ఎన్నో స‌న్నివేశాలు నిరాశ‌ప‌రిచేలా తెర‌కెక్కించారు. ఇక ర‌వికిష‌న్ ఎపిసోడ్స్ సిల్లీ కామెడీ పూర్తిగా త‌ల‌పోటు తెస్తుంది. క్లైమాక్స్ పూర్తిగా తేలిపోయింది. కార్తికేయ ఎంత‌గా వ‌ర్క‌వుట్ చేసినా కానీ అత‌డి శ్ర‌మ అంతా వృధా అయ్యింది. ప్ర‌చార హైప్ తో చ‌క్క‌ని ఓపెనింగ్స్ రావొచ్చు… కానీ తుదికంటా నిల‌బ‌డుతుందా లేదా అన్న‌ది చెప్ప‌లేం.

న‌టీన‌టులు:
కార్తికేయ చ‌క్క‌గా న‌టించాడు. తొలి రెండు చిత్రాల‌తో పోలిస్తే న‌ట‌న ప‌రంగా ఎంతో నేచుర‌ల్ గా క‌నిపించాడు. కామెడీ టైమింగ్ ఎమోష‌న్ ప‌లికించిన విధానం ఆక‌ట్టుకున్నాయి. అయితే న‌టుడిగా అత‌డు మ‌రింత మెరుగు ప‌డేందుకు ఆస్కారం ఉంది. నేహా క్యూట్ లుక్స్ బావున్నా న‌ట‌న ప‌రంగా చెప్పుకోవ‌డానికేం లేదు. ఇత‌ర పాత్ర‌లు రొటీన్. క‌మెడియ‌న్ ర‌ఘు కారుమంచి సెటైరిక‌ల్ కామెడీ ఆక‌ట్టుకుంది. ర‌వికిష‌న్ పాత్ర ప‌ర‌మ చెత్త‌.

టెక్నీషియ‌న్స్:
ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ మంచి క‌థ‌ను ఎన్నుకున్నా నేరేష‌న్ లో ఫెయిలయ్యాడు. వెంక‌ట్ ఫైట్స్ డిజైన్ ఆక‌ట్టుకుంది. ప్రేమ్ ర‌క్షిత్ , జానీ మాస్టార్ చ‌క్క‌ని కొరియోగ్ర‌ఫీ అందించారు. అనూప్ సంగీతం బావుంది. బీజీఎం ఓకే. కొన్ని డైలాగులు ఆక‌ట్టుకున్నాయి. ఎడిటింగ్ మ‌రింత బెటర్ గా చేయ‌డానికి ఆస్కారం ఉంది. ఇత‌ర శాఖ‌లు… ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

* కార్తికేయ న‌ట‌న‌, ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు
* ఎంచుకున్న క‌థ‌, కామెడీ

మైనస్ పాయింట్స్ :

*సెకండాఫ్‌
*ఎడిటింగ్
* సాగ‌తీత‌

ముగింపు:

90 ML .. ఏదీ కిక్కు?

రేటింగ్:
2.25/5