26 నుంచి విశాఖ‌లో 96

96 Remake Heads to Vishakapatnam

యంగ్ హీరో శర్వానంద్, స‌మంత జ‌టంగా త‌మిళ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `96` తెలుగు రీమేక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మాతృకకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సి. ప్రేమ్ కుమార్ ఇక్క‌డ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే కెన్యాలో మేజ‌ర్ షెడ్యూల్స్ పూర్తిచేసారు. ప్ర‌స్తుతం తదుప‌రి షెడ్యూల్ కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 26 నుంచి ఉక్కు న‌గ‌రం విశాఖ‌లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల‌పై విశాఖ అందాల న‌డుమ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారుట‌. జులై, ఆగ‌స్టు క‌ల్లా షూటింగ్ పూర్తిచేయాల‌ని అనుకుంటున్నారుట‌.

అనంత‌రం మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే సినిమా ప్రమోష‌న్ ప‌నులు మాత్రం వ‌చ్చే నెల నుంచి ప్రారంభించాల నుకుంటున్నారుట‌. ఇలాంటి సినిమాల‌కు ప‌బ్లిసిటీ కీలకం కాబ‌ట్టి వాటిని దిల్ రాజు ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఆ ప్లాన్ ఏంట‌న్న‌ది అప్ర‌స్తుతం. పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్, ఆడియో ఇలా ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేసి సినిమా విడుద‌ల‌య్యే లోపు బారీ హైపు తీసుకొచ్చేలా స‌న్నాహాలు చేస్తున్నాడుట‌. మాతృక‌కు సంగీతం అందించిన గోవింద వ‌సంత రీమేక్ కు బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు. ఇప్ప‌టికే కొన్ని పాట‌లు రికార్డింగ్ పూర్త‌యిందిట‌.