ప‌వ‌న్ కోసం `గోపాల గోపాల` సీక్వెల్?

ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలోనే మరో ద‌ఫా సినిమాల్ని ప్ర‌క‌టించ‌బోతున్నాడా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడాయ‌న‌. ఒక‌టి `పింక్‌` రీమేక్‌, మ‌రొక‌టి క్రిష్ తెరకెక్కిస్తున్న పిరియాడిక‌ల్ సినిమా. ఇక మూడో సినిమాని హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ఆ సినిమాని కూడా ప్ర‌క‌టించింది. ఇక మ‌రో ద‌ఫాలో రెండు చిత్రాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. వాటి కోసం క‌థలు ప‌క్కా చేయిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అందులో ఒక‌టి `గోపాల గోపాల‌` సినిమాకి సీక్వెల్ అని స‌మాచారం. దాన్ని కూడా `గోపాల గోపాల‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు డాలీనే తీయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత పూరి, త్రివిక్ర‌మ్‌ల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ ఈ సినిమాల్ని ఇప్ప‌ట్లో ప్ర‌క‌టించ‌క‌పోయినా ప‌వ‌న్ మాత్రం వీటికోసం ప్ర‌త్యేకంగా ఒక క్యాలెండ‌ర్‌ని రూపొందించాడ‌ట‌. ఆ మేర‌కు వ‌రుస‌గా సినిమాల్ని చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.