AMBని కొట్టేలా AAA సినిమాస్!!

Last Updated on by

AMBని కొట్టేలా AAA సినిమాస్!!

హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి ప‌రిస‌రాల్లో మ‌హేష్ – ఏఎంబీ మాల్ ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. ఏషియ‌న్ సినిమాస్ తో భాగ‌స్వామ్యంలో మ‌హేష్ ఈ భారీ మ‌ల్టీప్లెక్స్ ని నిర్మించారు. సాఫ్ట్ వేర్ హ‌బ్ లో ఈ మాల్ పెద్ద స‌క్సెసైంద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు స్టార్లు మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ పై పూర్తి స్థాయిలో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ నెల్లూరు సూళ్లూరుపేట ప‌రిస‌రాల్లో భారీగా మ‌ల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం స్టార్ హీరో అల్లు అర్జున్ ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి AAA మాల్ ని ప్రారంభిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నిర్మాణం మొద‌లైంది. అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్ ఏరియాలో భారీ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం సాగుతోంది. ఇప్ప‌టికే AAA మాల్ లోగో డిజైన్ రెడీ అయ్యింద‌ట‌. ఆ క్ర‌మంలోనే AAA అంటే ఏంటి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏషియ‌న్ సినిమాస్ అల్లు అర్జున్ అనేది అర్థం కాదు.. ఏషియ‌న్ సినిమాస్ అల్లు అర‌వింద్! అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. అంటే అల్లు అర‌వింద్ ఈ మాల్ నిర్మాణానికి భారీగా పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లుతున్నార‌ని దీన‌ర్థం. ఇక ఎలానూ స్టార్ హీరో బ‌న్ని పేరుతో ఈ మాల్ పాపుల‌ర‌వుతుంది. దానికి బ్రాండ్ ప్ర‌మోష‌న్ బ‌న్ని చూసుకుంటాడు. ఇక ఏఎంబీ మాల్ కి మ‌హేష్ పేరు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డనుందో ఏఏఏ మాల్ కి బ‌న్ని పేరు అంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. గ‌చ్చిబౌళి త‌ర‌హాలోనే అమీర్ పేట్ ఏరియా ఖ‌రీదైన ప్రైమ్ ఏరియా క‌బ‌ట్టి ఇక్క‌డా మాల్ పెద్ద స‌క్సెస‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఇది స‌క్సెసైతే వ‌రుస‌గా మ‌ల్టీప్లెక్సుల నిర్మాణానికి ఏషియ‌న్ – అల్లు అర్జున్ భాగ‌స్వామ్యం తెర తీయ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు బ‌న్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి స‌న్నాహాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

User Comments