కాబోయేవాడికి ఈ టెస్టులేంటి అదా

ఆదాశ‌ర్మ పెళ్లికి రెడీ అవుతోంది. పెళ్లికుమారుడు కావాల‌ని ఓపెన్ గా ప్ర‌క‌టించింది. ఒక‌రికొక‌రు న‌చ్చితే ఏడు అడుగులు వేయ‌డ‌మే ఆల‌స్య‌మంటోంది. అయితే కాబోయే వాడికి మాత్రం కొన్ని కండీష‌న్లు పెట్టింది. అవి తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే. ఇంత‌కీ ఏంటా కండీష‌న్లు?

కుర్రాడు ఉల్లిపాయ‌లు తిన‌కూడ‌దు. క‌చ్చితంగా మూడు పూట‌లు వండి పెట్టాలి. రెగ్యుల‌ర్ గా షేవ్ చేసుకోవాలి. కేవ‌లం ట్రెడిష‌న‌ల్ దుస్తులే వేసుకోవాలి. డైలీ ఐదు లీట‌ర్లు నీళ్లు తాగాలి. ఆరోగ్య‌వంతంగా ఉండాలి. మ‌ద్యం, మాంసాహారం ఇంట్లో నిషేధం. దేశంలో అన్ని భాష‌ల సినిమాల‌ను గౌర‌వించాలి. వాట‌ని చూసి ఎంజాయ్ చేయ‌గ‌ల‌గాలి. రంగు, కులం, రాశి తో ప‌నిలేదని తెలిపింది. ఈ కండీష‌న్లు బ‌ట్టి కుర్రాడు మంచి అల‌వాట్లు క‌లిగి ఉండాల‌ని అర్ధ‌మైంది.

ఇందులో కొన్ని కండీష‌న్లు ప‌ర్వాలేదు. ఇంకొన్నింటితో మాత్రం ఏకీభ‌వించ‌డం క‌ష్టమేన‌ని కొంత మంది కుర్రాళ్లు అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు పూట‌లు వండి పెట్టే వాడు ఎక్క‌డ దొర‌కుతాడు. ఇల్ల‌రికం తెచ్చుకున్నా మూడు పూట‌లు వంట‌ గ‌దిలో మ‌గ్గిపోవాలా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. భ‌ర్త వండిపె డితే … నువ్వు తినిపెడ‌తావా? అంటూ ఫ‌న్నీ సెటైర్లు వేస్తున్నారు. ట్విట‌ర్ లో పెళ్లి కూతురు గెట‌ప్ లో రెడీ అయిన కొన్ని ఫోటోల‌ను అదా పోస్ట్ చేసింది.