షూటింగ్ పూర్తి చేసుకున్న “ఆగ్రహం”

Last Updated on by

ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రం “ఆగ్రహం”ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ ‘ రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే కధాంశమిది..’ఆఫీసర్, సర్కార్3 చిత్ర లకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’ అని అన్నారు. చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ అడా రి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెర కెక్కిస్తున్నాం.ఎప్రిల్ చివర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నాం.’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ :రవిశంకర్,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడా రి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్. సురేష్

Also Read: Rowdies Invited For Suryakantham Pre Release Event!

User Comments