పాడేరు అట‌వీ ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో సగ‌భాగానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న `ఆకాశ‌వాణి`

Last Updated on by

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న న్యూ ఏజ్ స్టోరి `ఆకాశ‌వాణి`. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ న‌వంబ‌ర్ 2018లో విడుద‌ల చేశారు. ఆకాశంలో రేడియో, న‌క్షత్రాలతో పాటు కొంత మంది గిరిజ‌నులతో వైవిధ్యంగా ఉన్న ఈ సినిమా పోస్ట‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వైజాగ్‌లో గ‌త రెండు నెల‌లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

పాడేరు స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఉన్న భారీ సెట్‌ను వేసి చిత్రీక‌ర‌ణ‌ జ‌రిపారు. స్టోరి లైన్‌ను ఆధారంగా బారీగా వేసిన సెట్‌లోనే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. వైవిధ్య‌మైన బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో బాహుబ‌లి సిరీస్‌లో రాజ‌మౌళి అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

User Comments