అమీర్ ఖాన్ కిరణ్ కి ముద్దు ఇచ్చాడు

Last Updated on by

అమీర్ ఖాన్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇండియాతో పాటు ఇత‌ర దేశాల్లోనూ ఈ పేరుకు ప్రాణ‌మిచ్చేంత అభిమానులు ఉన్నారు. చేసే ప్ర‌తీ చిత్రం కొత్త‌దానికి అద్దం ప‌ట్టేలా ఉంటుంది. అందుకే రెండేళ్ల‌కో సినిమా చేసినా కూడా వ‌చ్చిన ప్ర‌తీసారి రికార్డుల‌ను కొల్ల‌గొడ‌తాడు అమీర్. క‌థ‌పై అంత ప‌ట్టు ఉంటుంది కాబ‌ట్టే 30 ఏళ్ల కెరీర్ లో ఈయ‌న చేసిన సినిమాలు 40 కూడా లేవు. ఈయ‌న గ‌త సినిమా దంగ‌ల్ వ‌చ్చి ఏడాది దాటేసింది. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ధూమ్ 3 ఫేమ్ విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు. మార్చ్ 14న త‌మ బ‌ర్త్ డే రోజు కానుక‌గా అభిమానుల‌కు ఓ బ‌హుమ‌తి ఇచ్చాడు అమీర్ ఖాన్. ఇన్నాళ్లూ ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ లో మాత్ర‌మే ఉన్న అమీర్ ఇప్పుడు ఇన్ స్టాగ్ర‌మ్ లో కూడా వ‌చ్చేసాడు. చైనాలోని ట‌ర్కీ, థైవాన్ లాంటి దేశాల్లో ఉన్న త‌న అభిమానుల కోసం ఇన్ స్టా ఓపెన్ చేసాడు అమీర్. వ‌చ్చీరాగానే ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌కుండా 2 ల‌క్ష‌ల 21 వేల మంది ఫాలోయ‌ర్స్ అమీర్ ఖాతాలోకి చేరిపోయారు.Aamir Khan Celebrated Birthday With Wife Kiran Raoఇప్ప‌టికే ఈయ‌న సోష‌ల్ మీడియాలో కింగ్. అమీర్ ఖాన్ ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్స్ 2 కోట్ల 30 ల‌క్ష‌ల మంది.. అలాగే ఫేస్ బుక్ లో కోటి 30 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ స్టాలో కూడా అమీర్ చేరిపోవ‌డం అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ సారి త‌న బ‌ర్త్ డే గిఫ్ట్ ఇదే అంటున్నాడు అమీర్. త‌న సినిమాల‌కు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫోటోస్ ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌బోతున్నాడు అమీర్ ఖాన్. దీనికి నిద‌ర్శ‌నంగా ఇప్పుడు ఇన్ స్టా ప్రొఫైల్ ఫోటో కూడా థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫోటో పెట్టుకున్నాడు అమీర్. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా న‌టిస్తున్నాడు. క‌త్రినాకైఫ్ హీరోయిన్. డిసెంబ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ తో కలిసి తన బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకొన్నాడు. మార్చ్ 14, 2018తో అమీర్ 54వ ఏట అడుగు పెడుతున్నాడు. మ‌రి అభిమానులంద‌రి త‌ర‌ఫున అమీర్ కు మ‌రొక్క‌సారి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలుపుదామా.. హ్యాపీ బ‌ర్త్ డే టూ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ వ‌న్ అండ్ ఓన్లీ అమీర్ ఖాన్.

User Comments