క‌మ‌ల్ ముగ్గుర్ని సెట్ చేసుకున్నాడు..

Last Updated on by

అవును.. ఇప్పుడు నిజంగానే ముగ్గుర్ని సెట్ చేసుకున్నాడు. త‌ప్పుగా అనుకోవ‌ద్దు.. త‌న సినిమా కోసం ముగ్గురు సెలెబ్రెటీస్ ను తీసుకున్నాడు ఈ లోక‌నాయ‌కుడు. ఈయ‌న్ని జీవితాంతం తిప్ప‌లు పెట్టే విశ్వ‌రూపం 2 ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ జూన్ 11 సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఒకేసారి తెలుగు, త‌మిళ‌, హిందీ వ‌ర్ష‌న్స్ విడుద‌ల చేయ‌బోతున్నాడు క‌మ‌ల్. దీనికోసం ప్ర‌తీ ఇండ‌స్ట్రీ నుంచి ఓ స్టార్ ను తీసుకున్నాడు. తెలుగు వ‌ర్ష‌న్ కోసం ఎన్టీఆర్ వ‌స్తున్నాడు. ఈయ‌న చేతుల మీదుగా విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. ఇక హిందీ వ‌ర్ష‌న్ ను అమీర్ ఖాన్.. తమిళ్ వ‌ర్ష‌న్ ను క‌మ‌ల్ కూతురు శృతిహాస‌న్ విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఈ చిత్ర తొలి భాగం 2013లో వ‌చ్చింది. ఇది వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే సీక్వెల్ రావాలి. కానీ రాలేదు.. ఇప్ప‌టికీ రాలేదు.. ఎప్ప‌డొస్తుందో తెలియ‌దు. కానీ మ‌న‌సు ప‌డి చేసిన సినిమా క‌దా.. అంత ఈజీగా వ‌దులుకోలేదు క‌మల్ హాస‌న్. అందుకే దానికోసం ఆస్తులు అమ్మి మ‌రి విశ్వ‌రూపం 2ను పూర్తి చేసాడు. నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్ సీన్ లోంచి త‌ప్పుకున్నా కూడా క‌మ‌ల్ హాస‌న్ బాధ్య‌త తీసుకుని పూర్తి చేసాడు సినిమాను. ఆ మ‌ధ్య ఇండియ‌న్ జెండాతో ఉన్న విశ్వ‌రూపం 2 ఫ‌స్ట్ లుక్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ కూడా సిద్ధ‌మైంది. ఇది విడుద‌లైన త‌ర్వాత అయినా సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయి అని ఆశిస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి ప‌ట్ట‌కూడ‌ద‌ని గ‌ట్టిగానే ఫిక్స్ అయ్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్.

User Comments