సీక్రేట్ గా డబ్బు కొట్టేసిన అమీర్ ఖాన్..

Last Updated on by

అవునా.. సినిమా సినిమాకు వంద‌ల కోట్లు తీసుకునే అమీర్ ఖాన్ కు సీక్రేట్ గా కొట్టేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇక్క‌డే క‌దా చిన్న ట్విస్ట్ ఉంది. ఆయ‌న సీక్రేట్ గా కొట్టేసినా అది అఫీషియ‌లే. దానికి కార‌ణం సీక్రేట్ సూప‌ర్ స్టార్. ఈయ‌న అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఇప్పుడు చైనా మార్కెట్ ను కుమ్మేస్తుంది. ఇండియాలోనే 100 కోట్లు కూడా సాధించ‌ని ఈ చిత్రం ఇప్పుడు చైనాలో 500 కోట్ల మార్క్ దాటి ప‌రుగులు తీస్తుంది. ఇంత‌గా అక్క‌డి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కావ‌డానికి కార‌ణం మాత్రం ఒక్క‌టే అమీర్ ఖాన్.. ఆ త‌ర్వాత ఎమోష‌న‌ల్ కంటెంట్. చైనా వాళ్ల‌కు ఏడిపిస్తే చాలు కోట్లు కుమ్మ‌రిస్తారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది.

పీకే.. దంగ‌ల్ సినిమాల‌కు కూడా అమీర్ అక్క‌డి వాళ్ల‌ను బాగా ఏడిపించేసాడు. అందుకే కోట్ల‌కు కోట్లు ఇచ్చేసారు. దంగ‌ల్ కోసం ఏకంగా 1200 కోట్లు రాసిచ్చేసారు చైనీయులు. ఇప్పుడు సీక్రేట్ సూప‌ర్ స్టార్ కూడా అంతే. ఓ ముస్లిం అమ్మాయి పాప్ స్టార్ కావాల‌నుకుంటుంది.. వాళ్ల నాన్న క‌ట్టుబాట్ల పేరు చెప్పి వ‌ద్దంటాడు.. అలాంటి అమ్మాయి ఎలా స్టార్ అయింది అనేది సీక్రేట్ సూప‌ర్ స్టార్ క‌థ‌. దీనికి చైనా ప్రేక్ష‌కులు ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రం దూకుడు చూస్తుంటే మ‌రో 200 కోట్లైనా ఈజీగా తెచ్చేలా క‌నిపిస్తుంది. అమీర్ ఇచ్చిన ధైర్యంతోనే మార్చ్ 2న భ‌జ‌రంగీ భాయీజాన్ ను కూడా చైనాలో విడుద‌ల చేస్తున్నారు. మ‌రి మ‌న సినిమాల మార్కెట్ ఇంకా చైనాలో ఎంత‌వ‌ర‌కు పెర‌గ‌బోతుందో..?

Follow US 

User Comments