నెల‌కి 40వేలొచ్చినా…ఆరోగ్య శ్రీ

ఏపీలో నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుభవార్త చెప్పారు. బడ్జెట్‌లో పింఛన్లకు అధిక నిధులు కేటాయించామని చెప్పారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించి.. కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిందని బుగ్గన వెల్లడించారు. టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే.. ఇక హ్యాపీ సండే ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ప్రచార ఆర్భాటం ఎక్కువ అయిందని, అందుకే ప్రజలు కూడా ‘మేటర్‌ వీక్‌..పబ్లిసిటీ పీక్‌’ అనేవాళ్లని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు.