ఏబీసీడీ మూవీ రివ్యూ

ABCD Live Review

నటీనటులు : అల్లు శిరీష్, రుక్షార్, మాస్ట‌ర్ భ‌ర‌త్, నాగ‌బాబు, వెన్నెల‌కిషోర్ త‌దిత‌రులు
బ్యానర్: మ‌ధుర ఎంట‌ర్ టైన్ మెంట్స్- బిగ్ బెన్ సినిమాస్
స‌మ‌ర్ప‌కుడు: డి.సురేష్ బాబు
నిర్మాత: మ‌ధుర శ్రీధ‌ర్ – య‌శ్ రంగినేని
రచన- దర్శకత్వం: స‌ంజీవ్ రెడ్డి

ముందు మాట:
మెగా హీరోల్లో రేసులో వెన‌క‌బ‌డిన హీరోగా అల్లు శిరీష్ పేరు వినిపిస్తుంది. `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు` త‌ర్వాత అత‌డికి హిట్టు అన్న‌దే ద‌క్క‌లేదు. క్ష‌ణం లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో విమ‌ర్శ‌కుల్ని మెప్పించినా.. బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అందుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. అందుకే ఈసారి ఎంతో తెలివిగా మ‌ల‌యాళ హిట్ చిత్రం ఏబీసీడీని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా టీజ‌ర్ .. ట్రైల‌ర్ , పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. పైగా సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఇందులో అంతో ఇంతో మ్యాట‌ర్ ఉంటుంద‌నే భావించారు. శిరీష్ ఈసారి ఎంతో ప‌ట్టుద‌ల‌గా న‌టించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో ఆడియెన్ ని మెప్పించిందా.. లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

కథనం అనాలిసిస్:
సినిమా రిలీజ్ ముందే క‌థాంశాన్ని చిత్ర‌యూనిట్ ఓపెన్ గానే చెప్పింది. అప్ప‌టికే మ‌ల‌యాళంలో రిలీజైన సినిమా కాబ‌ట్టి క‌థ చాలా వ‌ర‌కూ తెలిసిన‌దే. `అమెరిక‌న్ బోర్న్ క‌న్ఫ్యూజ్డ్ దేశీ` అనే ట్యాగ్ లైన్ తోనే క‌థ‌ను రివీల్ చేశారు. అమెరికన్ రిచ్ గ‌య్ అవి (శిరీష్‌) ఇండియా వ‌చ్చి ఇక్క‌డ స్ల‌మ్ముల్లో డ‌బ్బు సంపాదించేందుకు .. జీవితంలో అనుకున్న‌ది సాధించుకునేందుకు ప‌డిన క‌ష్టాలేంటి? అత‌డి పాలిట విల‌న్ ఎవ‌రు? డ‌బ్బు విలువ తెలియ‌ని అవీకి చివ‌రికి ఎలాంటి జ్ఞానోద‌యం అయ్యింది? అన్న‌దే ఈ సినిమా కథాంశం. అవి జీవితంలో అంద‌మైన అమ్మాయి (రుక్షార్‌) ఎవ‌రు? త‌న ల‌క్ష్య‌సాధ‌న‌కు ఆ అమ్మాయి ఎలా ఉప‌క‌రించింది అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ఓవ‌ర్ నైట్‌లో 20వేల డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టేవాడికి రూ.5000 సంపాద‌న‌తో స్ల‌మ్ లో బ‌తికెయ్ అంటే ఎలా ఉంటుంది? అందులోంచి పుట్టుకొచ్చే కామెడీ ఇంకెంత గ‌మ్మ‌త్తుగా ఉంటుంది? అంత ఖ‌ర్చు చేసే కొడుకును దారిలో పెట్టుకునేందుకు డాడ్ నాగబాబు ఏం చేశారు? ఇదంతా ఆస‌క్తిక‌ర డ్రామా. అయితే ఈ డ్రామాని ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు సంజీవ్ ఫెయిల‌య్యాడ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ శిరీష్ – భ‌ర‌త్ మ‌ధ్య కామెడీ సీన్ల త‌ప్ప ఇంకేమీ లేనేలేద‌ని ఆడియెన్ నిరాశ‌ప‌డ‌డం ఖాయం. అలాగే ద్వితీయార్థంలో సీరియ‌స్ మోడ్ కి వ‌చ్చాక పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ సీరియ‌స్ నెస్ కొంత ఇబ్బంది పెడుతుంది. వినోదం పండినా కానీ ఎందుక‌నో ల్యాగ్ … సాగ‌తీత అనిపిస్తుంది. సినిమా ద్వితీయార్థంలో ఆశించిన స్థాయి వినోదాన్ని పండించేందుకు సీరియ‌స్ మోడ్ ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంది. ఓవ‌రాల్ గా ఈ సినిమా శిరీష్ కెరీర్ కి మరో నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితాన్ని అందించింద‌ని చెప్పొచ్చు.

నటీనటులు:
శిరీష్ ఈ చిత్రంలో ఎంతో ప‌రిణ‌తితో ష‌టిల్డ్ గా న‌టించాడు. కొడుకు విష‌యంలో స్ట్రిక్ట్ గా ఉండే డాడ్ పాత్ర‌లో నాగ‌బాబు చ‌క్క‌గా న‌టించారు. భ‌ర‌త్ కామెడీ పెద్ద ప్ల‌స్. రుక్షార్ ప‌రిణ‌తి ఉన్న పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించి మెప్పించింది. ఇత‌ర పాత్ర‌లు ప‌రిధి మేర‌ ఆక‌ట్టుకున్నాయి.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు వీక్. సంగీతం.. కెమెరా వ‌ర్క్ ఫ‌ర్వాలేదు. ఎడిటింగ్ విభాగం మ‌రింత షార్ప్ గా ప‌ని చేయాల్సింది.

ప్లస్ పాయింట్స్:
*శిరీష్‌- భ‌ర‌త్ మ‌ధ్య కామెడీ సీన్స్
*ఎంచుకున్న క‌థాంశం

మైనస్ పాయింట్స్:
* స్లో నెరేష‌న్ .. ల్యాగ్ సీన్స్
* ద్వితీయార్థంలో సీరియస్ మోడ్..

ముగింపు:
కొత్త‌గా ట్రై చేశాడు.. మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ లో ఫెయిల‌య్యాడు..! శిరీష్ కి మ‌రోసారి నిరాశే..

రేటింగ్:
2.25/5.0