విశాల్ అభిమన్యుడు 2

Last Updated on by

ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్న అభిమ‌న్యుడు అందులోంచి బ‌య‌ట‌కు రాలేడు. వ్యూహాన్ని ఛేధించే స‌త్తా లేక, ఆ ర‌హస్య ం తెలియ‌క యుద్ధంలో మ‌ర‌ణిస్తాడు. కానీ క‌ళియుగంలో అభిమ‌న్యుడు మాత్రం పూర్తిగా వేరే. శ‌త్రువును గెలిచి యుద్ధం నుంచి తిరిగి రావాలంటే ఎలాంటి ఎత్తుగ‌డ‌లు అయినా వేసే ద‌మ్ము ఉండాలి. కేవ‌లం ఎత్తుగ‌డ‌లే కాదు, ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేయ‌గ‌లిగి ఉండాలి అని నిరూపించిన అభిన‌వ అభిమ‌న్యుడు విశాల్‌. ఇత‌డు బ‌య‌ట ఎలా ఉంటాడో సినిమాల్లోనూ అంతే మేధోత‌నం చూపిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు న‌టించిన తాజా చిత్రం అభిమ‌న్యుడు బంప‌ర్ హిట్ కొట్టింది. ఇదే చిత్రం ఇరుంబు తిరై పేరుతో త‌మిళంలో రిలీజై సంచ‌ల‌న విజయం సాధించింది. డిజిట‌ల్ ఇండియా ప‌ర్య‌వ‌సానంపై గొప్ప‌గా చూపించార‌న్న పేరొచ్చింది. క‌థ‌, కంటెంట్‌దే విజ‌యం అని మ‌రోసారి ప్రూవైంది.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. అభిమ‌న్యుడు టీమ్‌ వైజాగ్ విజిట్ చేసిన‌ప్పుడు అక్క‌డ సిఎమ్‌ఆర్‌ మాల్‌లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ విజయానందాన్ని పంచుకున్న వేళ విశాల్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుండీ నన్నెంతగానో ఆదరిస్తున్నారు. ఈ విజయంతో నాకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. త్వరలోనే ఇదే టీమ్‌తో అభిమన్యుడు-2 మొదలు పెట్టబోతున్నాం. పందెంకోడి-2 విజయదశమికి రిలీజ‌వుతుంది .. అని అన్నారు.

User Comments