మ‌హేష్ పారితోషికానికి చిల్లు

Mahesh Babu - File Photo

సూప‌ర్ స్టార్ మ‌హేష్ పారితోషికం ఎంత‌? స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి మ‌హేష్ అందుకున్న పారితోషిక ఎంత‌? అంటే ఊహించ‌ని విష‌యం తెలిసింది. మ‌హేష్ మార్కెట్ మున‌ప‌టి క‌న్నా రెట్టింపు అయింద‌న్న మాట మాత్రం  వాస్త‌వం. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల‌తో  వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నాడు. రెండు సినిమాలు 150 కోట్ల వ‌సూళ్ల‌ క్ల‌బ్ లో చేరాయి. అంటే మ‌హేష్ మార్కెట్ రెట్టింపు అయ్యే ఉంటుంద‌ని ఊహించ‌డం స‌హ‌జం. ఈ నేప‌థ్యంలో మహేష్ స‌రిలేరు నీక‌వ్వెరు చిత్రానికి 50 కోట్ల‌కు పైగా పారితోషికం అందుకుంటున్నాడ‌ని కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

మరి చిత్ర నిర్మాత‌లు మ‌హేష్ తో ఏ విధ‌మైన ఒప్పందం చేసుకున్నారు? బ‌ల్క్ గా 50 కోట్లు ఒకేసారి చెల్లించారా?  సినిమా బిజినెస్ ని బ్ట‌టి స్టెప్ తీసుకుంటున్నారా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు సంత‌కం చేసాడంటే అడ్వాన్స్ గా కొంత చెల్లించాలి. అటుపై షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత బ్యాలెన్స్ క్లియ‌ర్ చేస్తారు. అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు విష‌యంలో మ‌హేష్ తో స‌ద‌రు నిర్మాతలు  చేసుకున్న ఒప్పందం వేరు. కేవ‌లం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ (శాటిలైట్, డిజిట‌ల్, డ‌బ్బింగ్ రైట్స్  ) రూపంలో వ‌చ్చే మొత్తం ఎంతో అదే మ‌హేష్  రెమ్యున‌రేష‌న్ అవుతుందిట‌. అంటే మ‌హేష్ ఎలాంటి అడ్వాన్స్ తీసుకోరు. ఒప్పందం ప్ర‌కారం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ మాత్ర‌మే త‌న‌వి.

ఈ విలువ ర‌ఫ్ గా 50 కోట్లు అని నిర్మాత‌లు-మ‌హేష్ వేసిన అంచ‌న అది. మ‌రి సినిమా 50 కోట్ల నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ చేస్తుందా? అంటే లేద‌నే వినిపిస్తోంది. హిందీ రైట్స్ ఆశించిన దానికంటే 7 కోట్లు త‌క్కువే ప‌లికింద‌ని స‌మాచారం. మునుప‌టి ధ‌ర‌లివ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదుట‌. ఇక సినిమా కాస్ట్ యాబై కోట్లు అవుతుంద‌ని భావించారు. కానీ బ‌డ్జెట్ ఆ ఫ‌రిది దాటిపోయిందిట‌. దీంతో మ‌హేష్ ఖాతాలో జ‌మ అవుతుంద‌ని వేసిన 50 కోట్ల లెక్క దారి త‌ప్పిన‌ట్లు వినిపిస్తోంది. ఒప్పందం ప్ర‌కార‌మే మ‌హేష్ నాన్ థియేట్రిక‌ల్ రూపంలో ఎంత వ‌స్తే అంత‌టితో స‌రిపెట్టుకోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.