యాక్ష‌న్ మూవీ రివ్యూ

నటీనటులు : విశాల్, త‌మ‌న్నా, ఆకాంక్ష పూరి, ఐశ్వ‌ర్యా ల‌క్ష్మీ త‌దిత‌రులు..
బ్యానర్: ట‌్రైడెంట్ ఆర్ట్స్ (ఆర్.ర‌వీంద్ర‌న్)
నిర్మాత: శ్రీ‌నివాస్ ఆడేపు (తెలుగు వెర్ష‌న్)
సంగీతం: హిప్ హాప్ థ‌మీజా
రచన- దర్శకత్వం: సుంద‌ర్.సి
రిలీజ్‌: 15 న‌వంబ‌ర్ 2019

ముందు మాట:
కోలీవుడ్ లో సెటిలై తంబీల‌కు ధీటుగా స‌త్తా చాటుతున్న తెలుగు కుర్రాడు విశాల్. వ‌రుస‌గా భారీ యాక్ష‌న్ ప్యాక్డ్స్ సినిమాల్లో న‌టిస్తున్న విశాల్ తాజాగా మ‌రో `యాక్ష‌న్` సినిమాతో అభిమానుల ముందుకు వ‌చ్చాడు. తెలుగులో త‌న‌కంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విశాల్.. సుంద‌ర్.సి తో క‌లిసి పాన్ ఇండియా రేంజులో భారీ ప్ర‌యోగ‌మే చేసిన‌ట్టు ట్రైల‌ర్ చెప్పింది. విశాల్ కి ధీటుగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఫైట్స్ చేస్తుండ‌డం స‌ర్ ప్రైజ్ థింగ్. అయితే ట్రైల‌ర్ లో ఉన్నంత మ్యాట‌ర్ సినిమాలో ఉందా లేదా? సుంద‌ర్ సి నేటి త‌రానికి త‌గ్గ సినిమా తీసి పాన్ ఇండియా కోరిక తీర్చుకున్నాడా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
ముఖ్యమంత్రి కొడుకు సుభాష్ (విశాల్‌) ఆర్మీ క‌ల్న‌ల్. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాబోయే ప్ర‌ధాని గుప్తాజీ హ‌త్య‌కు గురైతే ఆ నింద‌ సుభాష్ సోద‌రుడు రాంకీపై ప‌డుతుంది. అటుపై రాంకీ మిస్ట‌రీ డెత్ వెన‌క ఏం జ‌రిగింది? అస‌లు అందుకు కార‌కులెవ‌రు? పీఎం మ‌ర్డ‌ర్ వెన‌క ఏం జ‌రిగింది? వ‌గైరా వ‌గైరా విష‌యాల నిగ్గు తేల్చేందుకు మిష‌న్ చేప‌ట్టిన క‌ల్న‌ల్ సుభాస్ చివ‌రికి నిజాల్ని క‌నుగొన్నాడా లేదా? ఈ క‌థ‌లో ప‌్ర‌మాద‌క‌ర తీవ్ర‌వాదుల పాత్ర ఏమిటి? ఇందులో ఇబ్ర‌హీమ్ మాలిక్ (క‌బీర్ సింగ్) పాత్ర ఏమిటి? ఇందులోనే అందాల భామ త‌మ‌న్నా మిష‌న్ ఏమిటి? అన్న‌దే సినిమా.

ఈ త‌ర‌హా యాక్ష‌న్ పాత్ర‌ల‌కు విశాల్ పెట్టింది పేరు. మునుప‌టిలానే య‌థాత‌థంగా అత‌డు హై ఆక్టేన్ యాక్ష‌న్ సీక్వెన్సుల్లో అద్భుతంగా న‌టించాడు. ఆరంభం త‌మ‌న్నాని కాపాడే సీన్ త‌ర్వాత ఎందుక‌నో కొంత స్పీడ్ త‌గ్గుతుంది కానీ.. ఆ త‌ర్వాత ఆకాంక్ష పూరి రాక‌తో ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ గ్రిప్ పెరుగుతుంది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మ‌రింత గ్రిప్పింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా బ్యాంక్ హ్యాకింగ్ సీన్.. క్లైమాక్స్ అద్భుతంగానే తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కుని ప‌నిత‌నం చాలాచోట్ల ఆక‌ట్టుకుంటుంది. కొన్ని చోట్ల చైల్డిష్ అనిపించినా లాజిక్ లేని సీన్లు క‌నిపించినా కానీ విజువ‌ల్ బ్రిలియ‌న్సీ ముందు భారీ యాక్ష‌న్ కంటెంట్ ముందు ఇవేవీ క‌నిపించ‌వు. ఫ్యామిలీ ఆడియెన్ కి మ‌రీ అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ యూత్ టీనేజ‌ర్స్ కి ఈ థ్రిల్ల‌ర్ న‌చ్చుతుంది. ఒక‌సారి చూడాల్సిన సినిమా అనే చెప్పుకోవ‌చ్చు. ఇక ఇందులో త‌మ‌న్నా గ్లామ‌ర్ యాక్ష‌న్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అనే చెప్పాలి.

నటీనటులు:
యాక్ష‌న్ హీరోగా విశాల్ మ‌రోసారి మెప్పించాడు. సుంద‌ర్.సి ప‌నిత‌నం బెట‌ర్ గా ఉంది. అందాల భామ‌లు త‌మ‌న్నా- ఆకాంక్ష ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇత‌ర పాత్ర‌ధారులు ఫ‌ర్వాలేద‌నిపిస్తారు.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా విజువ‌ల్ ఫీస్ట్ మూవీ ఇది. నిర్మాణ విలువ‌లు అత్యున్న‌తంగా కుదిరాయి. కెమెరా- రీరికార్డింగ్ అద్భుతంగా ఆక‌ట్టుకున్నాయి. ట‌ర్కీ అజ‌ర్ భైజాన్ లొకేష‌న్ల‌ను ఛాయాగ్రాహ‌కుడు అద్భుతంగా చూపించారు. ఇక బీజీఎం సినిమాకి ప్ర‌ధాన అస్సెట్ గా నిల‌ప‌డంలో హిప్ హాప్ థ‌మీజా ప్ర‌తిభ‌ను పొగ‌డొచ్చు. కొన్ని లెంగ్తీ సీన్స్ కనిపించినా భారీ యాక్ష‌న్ ముందు ఏ లోపం క‌నిపించ‌దు. అయితే గ్రాఫిక్స్ – వీఎఫ్ ఎక్స్ ప‌రంగా మ‌రింత క్వాలిటీ మెయింటెయిన్ చేయాల్సింది.

ప్లస్ పాయింట్స్:

* విజువ‌ల్ బ్రిలియ‌న్సీ.. ఎంచుకున్న‌ యాక్ష‌న్ స్టోరి
* విశాల్-త‌మ‌న్నా-ఆకాంక్ష న‌ట‌న‌..
* రీరికార్డింగ్ – బీజీఎం

మైనస్ పాయింట్స్:

* లెంగ్తీ సీన్స్
* సీజీఐ.. వీఎఫ్ ఎక్స్

ముగింపు:
యాక్ష‌న్‌: స‌్టంట్స్ ఎక్కువే.. గ్లామ‌రూ ఎక్కువే!

రేటింగ్:
2.75/ 5