షాక్.. మహేష్ తో 8 నిమిషాల సీన్ కు 20 కోట్లు

Action Sequence Cost 20 Crores Mahesh Spyder

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తోన్న ‘స్పైడర్’ రిలీజ్ కు రెడీ అవుతూనే సంచలనాలు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 200 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసిందని వార్తలు వినిపించాయి. అలాగే ఈ బడ్జెట్ లో చాలా మట్టుకు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేస్తున్నారని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడేమో అంతకుమించి అనేలా.. ఈ స్పైడర్ లో 8 నిముషాలు ఉండే ఒక సీన్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలియడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
అసలు విషయంలోకి వెళితే, ఈ సూపర్ స్టార్ స్పైడర్ భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గానూ, సైంటిఫిక్ థ్రిల్లర్ గానూ తెరకెక్కుతోన్న విషయం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో విలన్ రోల్ చేసిన ఎస్జె సూర్య ఓ సందర్భంలో ఓ రసాయన బాంబుతో ఓ పాఠశాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తాడట. ఆ టైమ్ లో హీరో మహేష్ విలన్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రిస్కీ స్టంట్స్ చేస్తాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్ నే మురుగదాస్ భారీ అంటే భారీ స్థాయిలో తెరకెక్కించాడని అంటున్నారు. ప్రధానంగా 8 నిమిషాల నిడివి ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటేనే.. మురుగదాస్ ఏ లెవెల్ లో తెరకెక్కించాడో అర్థమైపోతుంది. అందుకే ఈ సీక్వెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. మరి దసరా కానుకగా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ‘స్పైడర్’ ఇలాంటి భారీ ఆకర్షణలతో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.