చ‌ల‌పాయ్.. మ‌ళ్లీ నోరు జారావ్ బాబోయ్..

అత‌డు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లైపోయింది. ఎన్నో వంద‌లసినిమాల్లో న‌టించారు.. కానీ ఏ రోజు ఇంత‌గా సోష‌ల్ మీడియాలోగానీ.. టీవీ ఛానెల్స్ లో గానీ అత‌డి పేరు ట్రెండ్ అవ్వ‌లేదు. కానీఆ మ‌ధ్య ఒక్క మాట నోరు జారినందుకు పేరు కూడాదిగ‌జారిపోయింది. అత‌డే చ‌ల‌ప‌తిరావ్ అని మ‌రీ ప్ర‌త్యేకంగాచెప్ప‌నక్క‌ర్లేదు. ఆడ‌వాళ్లు ప‌క్క‌లోకే ప‌నికొస్తారు అంటూ ఆ మ‌ధ్యరారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక‌లో ఆయ‌న అన్నమాట‌ దావా లం లా వ్యాపించాయి. అత‌డితో పాటు త‌న చుట్టూఉన్న వాళ్ల‌ను కూడా ఈ కాంట్ర‌వ‌ర్సీలో ఇరికించేసాడుచ‌ల‌ప‌తిరావ్. అక్క‌డితో ఈ వివాదం ముగిసిందేమో అనుకుంటేఇప్పుడు మ‌రోసారి నోరు జారాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. తాజాగాగ‌రుడ‌వేగ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ కు వ‌చ్చిన చ‌ల‌ప‌తి రావ్..మ‌రోసారి నోటికి ప‌నిచెప్పాడు.

చ‌ల‌ప‌తిరావు మైక్ తీసుకున్న‌పుడే రాజ‌శేఖ‌ర్ సెటైర్ వేసాడు.జీవిత సెన్సార్ క‌ట్ ఉంటుంది చూసుకో అనేసాడు. అలా అన్నత‌ర్వాత కూడా ఈ సీనియ‌ర్ న‌టుడు నోరు జారాడు. సినిమాలోప్ర‌వీణ్ స‌త్తార్ ఫైట్లు చేయించి చేయించి త‌న మోకాళ్ల చిప్ప‌లుఅరిగిపోయేలా చేసాడంటూ చెప్పాడు రాజ‌శేఖ‌ర్. దానికిస‌మాధానంగా మాట్లాడుతూ.. అప్ప‌ట్లోనే డాన్సులు చేసి నీమోకాళ్ల చిప్ప‌లు అర‌గ్గొట్టుకున్నావు.. ఇక ఇప్పుడు మ‌ళ్లీ మోకాళ్లచిప్ప‌లు పోయాయంటున్నావు.. వాటితో చాలా ప‌నులు ఉంటాయిచూసుకో అంటూ సెటైర్ వేసాడు. మ‌ళ్లీ వెంట‌నే మాటస‌వ‌రించుకుని.. తాను ఇది కేవ‌లం సింగిల్ మీనింగ్ తోనేఅన్నాన‌ని క‌వ‌ర్ చేసుకున్నాడు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టంజ‌రిగిపోయింది.

ఇది మాత్ర‌మే కాదు.. ఈ మ‌ధ్యే అమ్మాయిల క‌ట్టుబొట్టుపై కూడామాట జారాడు చ‌ల‌పాయ్. ఇప్ప‌టి అమ్మాయిలు చీర‌ క‌ట్టుకోవ‌డంమానేసార‌ని.. లంగాఓణీలు ఇస్తే ఓణిని తీసుకుని త‌ల‌కుక‌ట్టుకుంటున్నార‌ని.. జీన్స్ లు.. షార్ట్ లు అంటూ పిచ్చిడ్ర‌స్సుల‌న్నీ వేసుకుంటున్నార‌ని చెప్పాడు. అంతేకాదు..ఇలాంటి డ్ర‌స్సులు వేసుకున్న‌పుడు కుర్రాళ్ళు కామెంట్ చేస్తారు.అలాంట‌ప్పుడు ప‌డాలి.. లేదంటే ఎదురు తిర‌గాలి.. త‌ప్ప‌దంటూఆడాళ్ల‌పై నోరు జారాడు ఈ సీనియ‌ర్ యాక్ట‌ర్. మొత్తానికి కెరీర్చివ‌రిద‌శ‌లో అన‌వ‌స‌రంగా మ‌ళ్లీ మ‌ళ్లీ వివాదాల్లోఇరుక్కుంటున్నాడు చ‌ల‌ప‌తిరావ్