నాగార్జున‌.. మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్

Last Updated on by

అదేంటి.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 30 ఏళ్లు దాటిన త‌ర్వాత ఇప్పుడు నాగార్జున‌కు మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఆయ‌న దూకుడు చూసి ఈ మాట అన‌డంలో త‌ప్పేం లేదు. ఎందుకంటే అన్నింట్లోనూ ఆయ‌న దూకుడు అలా ఉంది మ‌రి. ఈ ఏజ్ లోనూ ఇండ‌స్ట్రీని కొత్త పుంత‌లు తొక్కిస్తున్నాడు మ‌న్మ‌థుడు. ప్ర‌స్తుతం ఈయ‌న మ‌ల్టీస్టార‌ర్స్ కు కేరాఫ్ గా మారిపోయాడు. ఇప్పుడు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తున్న సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. ఏ హీరో ఇప్పుడు వ‌ర్మ‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌డు. కానీ నాగ్ మాత్రం క‌థ న‌చ్చి వెంట‌నే వ‌ర్మ‌కు ఓకే చెప్పాడు. ఇక ఈ చిత్రంతో పాటు నానితో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి సై అనేసాడు నాగార్జున‌. ఈ త‌రం కుర్ర హీరోల‌తో నాగ్ మ‌ల్టీస్టార‌ర్స్ బాగానే చేస్తున్నాడు. ఇప్ప‌టికే విష్ణుతో కృష్ణార్జున‌.. కార్తితో ఊపిరి లాంటి సినిమాలు చేసాడు ఈ హీరో. ఇప్పుడు నానితో శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు. ఈ భారీ చిత్రాన్ని అశ్వినీద‌త్ నిర్మిస్తున్నాడు.

ఓ వైపు మ‌ల్టీస్టార‌ర్స్ చేస్తూనే మ‌రోవైపు పొలిటిక‌ల్ న్యూస్ కూడా నాగార్జున చుట్టూనే ఉన్నాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ లో నాగార్జున న‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. దానికి ఓ కార‌ణం కూడా ఉంది. జ‌గ‌న్ కు నాగ్ అత్యంత స‌న్నిహితుడు. పైగా వైస్ బ‌తికున్న‌పుడు ఆయ‌న‌తో సాన్నిహిత్యంగా ఉండేవాడు నాగార్జున‌. దానికితోడు ఆ మ‌ధ్య వైసిపిలోకి నాగార్జున వెళ్తాడ‌నే వార్త‌లొచ్చాయి. అయితే తాను పొలిటిక‌ల్ ఎంట్రీ జీవితంలో ఇవ్వ‌న‌ని చెప్పాడు నాగార్జున‌. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు.. మ‌రో వైపు నాని లాంటి హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్స్.. ఇంకోవైపు పాలిటిక్స్.. ఇలా అన్నింటి మ‌ధ్య ఇప్పుడు నాగార్జున నిజంగానే హ్యాపెనింగ్ స్టార్ అయ్యాడు.

User Comments